Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 26 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 226770. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 110960. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 109462. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6348. . కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో వెలుగు చూస్తున్న ఆసక్తికర విషయాలు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు పోలీసుల అదుపులో 25 మంది స్ట్రీట్ ఫైటర్లు.. పండుగ్యాంగ్ లొ గుంటూరు, మంగళగిరి చెందిన యువకులు ఉన్నట్టు తేల్చినా పోలీసులు.. పాతనేరస్థుల పైనా అనుమానాలు..
  • అమరావతి లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి రంగం సిద్ధమవుతోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
  • వలస కూలీల అంశంలో సప్రీంకోర్టు ఆదేశాలను కోరిన జాతీయ మానవ హక్కుల సంఘం. వలస కూలీల సమస్య పరిష్కారానికి సుప్రీం ఆదేశాలు అవసరమన్న ఎన్ హెచ్ ఆర్ సీ. ఇవాళ మధ్యాహ్నం వలస కూలీల అంశంపై విచారించనున్న సుప్రీంకోర్టు. ఇప్పటికే వలస కూలీల అంశాన్ని సుమోటోగా తీసుకొని కొన్ని మధ్యంతర ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు.
  • టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కామెంట్స్. 11వతీదీ నుంచి గంటకు 500మందికి దర్శనాలు కల్పిస్తాము. 50శాతం ఆన్ లైన్ లోనూ, మరో యాభై శాతం ఆఫ్ లైన్ లోనూ దర్శనాలపై రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తున్నాము. ఆన్ లైన్లో లేదా ఆఫ్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే దర్శనాలకి అనుమతి ఇస్తాము. వచ్చిన భక్తులందరికీ అలిపిరి గేటు దగ్గర పరిక్షలు చేసాకే కొండపైకి అనుమతిస్టాము. కొండపైకి వచ్చాక కూడా.. క్యూలైన్ల లోకి వెళ్లేముందు కూడా ధర్మల్ స్క్రీనింగ్ చేస్తాము.
  • అమరావతి డాక్టర్ సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పోస్ హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు లో విచారణ. సుధాకర్ పిటిషన్ ను అనుమతించిన కోర్టు హాస్పిటల్ superendent అనుమతి తో సుధాకర్ డిశ్చార్జ్ కావచ్చు సీబీఐ విచారణకు సహకరించాలని సుధాకర్ ను ఆదేశించిన కోర్టు.

రెచ్చిపోయిన గజరాజులు..17 మందికి గాయాలు.. అసలేమైంది ?

Two elephants run amok at religious parade in Sri Lanka, రెచ్చిపోయిన గజరాజులు..17 మందికి గాయాలు.. అసలేమైంది ?

శ్రీలంకలో ఓ మతపరమైన ఊరేగింపు భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో రెండు ఏనుగులను ఘనంగా అలంకరించి నిర్వాహకులు తీసుకువచ్చారు. సాధారణంగా గజరాజులు ఇలాంటి సెలబ్రేషన్స్ లో నిబ్బరంగా పాల్గొంటాయి. మావటీలు ముందుగానే అలా వాటికి శిక్షణ ఇస్తారు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ ఏనుగులు ఉన్నట్టుండి.. రెచ్చిపోయి ముందుకు పరుగులు తీశాయి. దీంతో భక్తులంతా భయంతో తలో దిక్కుకూ పారిపోయారు. ఈ తొక్కిసలాటలో కొందరు మహిళలు సహా 17మంది గాయపడ్డారు. పైగా ఓ గజరాజుపై నుంచి మావటీ కింద పడిపోయాడు. అనుకోని ఈ హఠాత్ సంఘటన అందర్నీ నిశ్చేష్టుల్ని చేసింది.
కాగా-ఒక్కోసారి ఏనుగులు అత్యంత దూకుడుగా ప్రవర్తిస్తాయని, ఇందుకు వీటి హార్మోన్లు కారణమని జయంత్ జయవర్దనే అనే జంతు నిపుణుడు తెలిపాడు. పండుగలు, పబ్బాలు లేదా ఈ విధమైన మతపరమైన కార్యక్రమాల్లో గజరాజులను వినియోగించే ముందు వాటి ప్రవర్తన ఎలా ఉందో నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. బహుశా ఏనుగులు తమ బ్రీడింగ్ సీజన్ లో ఇలా రెచ్చిపోతుంటాయని, ఆ సమయంలో వాటిని అదుపు చేయడం కష్టమవుతుందని ఆయన చెప్పాడు. మావటీలు ముఖ్యంగా మగ గజరాజుల నడవడికపై ప్రధానంగా దృష్టి పెట్టవలసి ఉంటుందని జయవర్ధనే అన్నాడు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు తగలలేదు. అయితే భక్తులు, ఇతరులు భయంతో వణికిపోయారు.

Related Tags