భారీ నష్టాల్లో పేటీఎం… రోజుకు రూ.11 కోట్ల నష్టం!

At Rs 3960 crore losses mount 165% for Paytm parent One97, భారీ నష్టాల్లో పేటీఎం… రోజుకు రూ.11 కోట్ల నష్టం!

పేటీఎం పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి గతంలో కంటే మూడు రెట్ల నష్టాన్ని చవి చూసింది. పేటీఎం బ్రాండ్ నిర్మాణం కోసం, వ్యాపార విస్తరణ కోసం భారీ ఎత్తున ఖర్చు చేసింది. ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ నష్టం మార్చి 31వ తేదీ నాటికి రూ.4,217.20 కోట్లకు పెరిగింది. అంటే రోజుకు సగటున రూ.11 కోట్ల వరకు నష్టపోయింది. అంతకుముందు ఏడాది ఇది ఈ నష్టం రూ.1,604.34 కోట్లుగా ఉండేది. ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది.

దీని ప్రకారం వన్97 మొదటి లాభాన్ని 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.207.61 కోట్లుగా అంచనా వేస్తోంది. వన్ 97 కమ్యూనికేషన్స్ 2026 ఆర్థిక సంవత్సరానికి రూ.8,512.69 కోట్ల మేర లాభాన్ని నమోదు చేయవచ్చునని గత ఫిబ్రవరి నెలలో అంచనా వేశారు. 2019 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం రెవెన్యూ రూ.8.2 శాతం పెరిగి రూ.3,579.67 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది రూ.3,309.61 కోట్లుగా ఉంది. అదే సమయంలో ఖర్చులు మాత్రం రెండింతలు పెరిగి రూ.7,730.14గా ఉన్నాయి. అంతకుముందు ఏడాది ఖర్చులు రూ.4,864.53గా ఉన్నాయి.

ఈ కంపెనీ తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు, బ్రాండ్‌ను డెవలప్ చేసుకునేందుకు భారీ మూలధనం ఇన్వెస్ట్ చేసిందని, వివిధ మూలధన, కార్యాచరణ వ్యయాల్లో గణనీయమైన మొత్తాలను తాము కలిగి ఉన్నామని, దీని ఫలితంగా ఆర్థిక సంవత్సరంలో నష్టాలు సంభవించాయని కంపెనీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. గత నెలలో పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ… పేటీఎం వ్యాల్యుయేషన్ 25 శాతం పెరిగి 15 బిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *