కన్నీటి కడలిలో ‘బిగ్ బాస్’… కన్ఫ్యూషన్‌లో కంటెస్టెంట్స్!

Anchor Siva Jyothi Strong Contestant In Bigg Boss But Cant Control Emotions, కన్నీటి కడలిలో ‘బిగ్ బాస్’… కన్ఫ్యూషన్‌లో కంటెస్టెంట్స్!

బిగ్ బాస్ మూడో సీజన్ ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. హౌస్‌లోనే అత్యంత స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరున్న అలీ రెజా.. ఊహించని రీతిలో ఎలిమినేట్ కావడంతో షో టైటిల్ ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇకపోతే అలీ రెజా ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు కంటెస్టెంట్లు చాలా బాధపడ్డారు. యాంకర్ శివజ్యోతి అయితే అలీ వెళ్లేంతవరకు ఏడుస్తూనే ఉంది. ఒకరకంగా చెప్పాలంటే శివజ్యోతి.. అలీని సొంత అన్నయ్యగా భావించడంతో ఆమె ఎమోషన్స్‌ను కంట్రోల్ చేయలేకపోయింది.

ఇకపోతే శివజ్యోతి షో‌లోని అన్ని టాస్కుల్లో చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. కానీ ప్రతి చిన్న విషయానికి ఆమె ఏడుస్తుండటం.. ఎమోషన్స్‌ను కంట్రోల్ చేయలేకపోవడం చూసే ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తోందనే చెప్పాలి. నిన్నటి ఎపిసోడ్‌లో కూడా ఇదే మాదిరిగా అలీని గుర్తుచేసుకుని ఏడుస్తూనే.. మరో యాంకర్ శ్రీముఖి కొంచెం గట్టిగానే బదులు ఇచ్చింది.

మరోవైపు శివజ్యోతితో ఎమోషనల్‌గా కనెక్ట్ అయిన వ్యక్తులు అందరూ ఎలిమినేట్ అవుతుండటం ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది. మొదటగా ఆమెతో రోహిణి స్నేహం చేయగా.. నాలుగోవారంలో ఎలిమినేషన్ ఎదుర్కొంది. ఆ తర్వాత అషు రెడ్డి ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు అలీ రెజా బయటకు వచ్చేశాడు. చూడాలి మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *