టాప్ 10 న్యూస్ @ 6PM

| Edited By:

Aug 05, 2019 | 5:57 PM

1.ఆర్టికల్ 370 నిజంగా రద్దయిందా ..? దీన్ని కోర్టుల్లో ఛాలెంజ్ చేయవచ్చా ..? జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసింది. కాశ్మీర్ ను లడఖ్, జమ్మూ కాశ్మీర్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినప్పటికీ.. ఈ అధికరణాన్ని పార్లమెంటు ఆమోదించాల్సిన అవసరం లేదు…Read more 2.కశ్మీర్‌పై మా తాజా ఆర్డర్..బీ అలర్ట్..సీఎంలకు మోదీ ఫోన్! జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని  రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us on

1.ఆర్టికల్ 370 నిజంగా రద్దయిందా ..? దీన్ని కోర్టుల్లో ఛాలెంజ్ చేయవచ్చా ..?

జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసింది. కాశ్మీర్ ను లడఖ్, జమ్మూ కాశ్మీర్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినప్పటికీ.. ఈ అధికరణాన్ని పార్లమెంటు ఆమోదించాల్సిన అవసరం లేదు…Read more

2.కశ్మీర్‌పై మా తాజా ఆర్డర్..బీ అలర్ట్..సీఎంలకు మోదీ ఫోన్!

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని  రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే జమ్ము-కశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా.. లడఖ్‌ను చట్టసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించారు…Read more

3.మోదీ సర్కార్ నిర్ణయం శభాష్: ఆర్ఎస్ఎస్

ఆర్టికల్ 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వాగతించింది. ఈ వ్యవహారంతో ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా వ్యవహరించిందని మోదీ సర్కార్ పై ప్రశంసలు కురిపించింది…Read more

4.కేంద్రం నిర్ణయానికి ఆప్ మద్దతు.. కేజ్రీవాల్ ట్వీట్

దశాబ్దాల తరబడి సమస్యాత్మకంగా మారిన జమ్మూ కశ్మీర్ విషయంలో స్వయం ప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని  ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. ఈ విషయంలో కేంద్రానికి తాము మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు…Read more

5.ఆయనా ఆ కోవలోని వారే! : చరిత్రకారుడు రామచంద్ర గుహ ఫైర్

ఆర్టికల్ 370 రద్దు పై చరిత్ర పరిశోధకులు రామచంద్ర గుహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీరుపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్‌కు కోవింద్…Read more

6.బీజేపీ చారిత్రక నిర్ణయం.. ఆర్టికల్ 370 రద్దుకు ముందు.. తర్వాత..!

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు కావడంతో దేశ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. మెజార్టీ ప్రజలు ఆర్టికల్ 370 రద్దును స్వాగతిస్తుంటే.. కొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆర్టికల్ 370 రద్దు కావడం…Read more

7.హిందూత్వకు పెద్ద పీట వేశారు..: శారదా పీఠాధిపతి స్వరూపానంద

ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద, ఉత్తరాధికారి స్వాత్మానంద స్వామీజీలు స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిషాలకు వారి అభినందనలు తెలిపారు…Read more

8.ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌కు హైఅలర్ట్

జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో…Read more

9.నాటి యువ మోదీ..నేడు నెరవేర్చిన హామీ : రాం మాధవ్

గత కొద్ది రోజులుగా జమ్మూ కశ్మీర్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రం భారీ సంఖ్యలో బలగాలను కశ్మీర్లో మోహరిస్తోంది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్‌ నుంచి యాత్రికులు, పర్యాటకులను వెనక్కి పంపిస్తున్నారు. తాజాగా…Read more

10.ఆర్టికల్ 370 రద్దు: ఎవరేమన్నారంటే..!

జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. అనంతరం దీనికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం నుంచి కూడా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది…Read more