Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 236657. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 115942. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 114073. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6642. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి.. సచివాలయంలో కరోనా కలకలం ఈ రోజు మరో ఐదు పాజిటివ్ కేసులు నమోదు మొత్తం 9 కి చేరిన పాజిటివ్ కేసులు అసెంబ్లీలో ఒక పాజిటివ్ కేసు నమోదు.
  • అమర్‌నాథ్ యాత్రకు పచ్చజెండా. జులై 21 నుంచి ఆగస్టు 3 వరకు యాత్ర. 15 రోజులు మాత్రమే యాత్రా సమయం. 55ఏళ్లు పైబడినవారికి యాత్రకు అనుమతి లేదు. కోవిడ్-19 జాగ్రత్తలతో యాత్రకు ఏర్పాట్లు. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి. బాల్తాల్ మార్గంలో మాత్రమే యాత్రకు అనుమతి. పహల్‌గాం వైపు నుంచి ఉన్న యాత్రామార్గం మూసివేత.
  • తెలంగాణ లో జిమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతోష్. తెలంగాణ లో జిమ్ ల నిర్వహణకు అనుమతివ్వండి. కోవిడ్ నిబంధనలకు లోబడి జిమ్ లను నిర్వహిస్తాం. ప్రభుత్వానికి తెలంగాణ జిమ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ . జిమ్ లను నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఆదారపడి ఉన్నాయి. జిమ్ ల తెరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలివ్వాలి. తెలంగాణ వ్యాప్తంగా 5 వేల జిమ్ ల్లో 50 వేల మంది ఆధారపడిన ఇండస్ట్రీ.
  • కర్నూలు: భూమా అఖిలప్రియ ఏ వి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు వారి వ్యక్తిగతం. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు... టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.
  • విశాఖ: దివ్య కేసులో కొనసాగుతున్న పోలీస్ దర్యాప్తు. రావులపాలెం నుంచి దివ్య పిన్ని కృష్ణవేణిని పిలిపించిన పోళిసులు. దివ్య కేసులో మరికొంతమంది పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు. ఇప్పటికే వసంతతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. దివ్య ఘటనపై విచారణ జరుపుతున్నాం. తొలుత అనుమానాస్పద మృతికేసు నమోదు చేశాం.. పలుకోణాల్లో విచారిస్తున్నాం: డీసీపీ రంగారెడ్డి.

మోదీ సర్కార్ నిర్ణయం శభాష్: ఆర్ఎస్ఎస్

RSS Praises Modi Sarkar Decision Jammu Kashmir Decision, మోదీ సర్కార్ నిర్ణయం శభాష్: ఆర్ఎస్ఎస్

ఆర్టికల్ 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వాగతించింది. ఈ వ్యవహారంతో ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా వ్యవహరించిందని మోదీ సర్కార్ పై ప్రశంసలు కురిపించింది. కేంద్ర ప్రభుత్వ చర్య జమ్మూకశ్మీర్‌కే కాకుండా దేశప్రజల ప్రయోజనాలకు చాలా అవసరమని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. స్వార్థ ప్రయోజనాలను, రాజకీయ విభేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి, మద్దతుగా నిలవాలని కోరింది. ఇక కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు నేతలు సమర్థిస్తుంటే.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు.

Related Tags