నాటి యువ మోదీ..నేడు నెరవేర్చిన హామీ : రాం మాధవ్

Promise fulfilled: Ram Madhav tweets old photo of PM Modi with scrap Article 370 in background, నాటి యువ మోదీ..నేడు నెరవేర్చిన హామీ : రాం మాధవ్

గత కొద్ది రోజులుగా జమ్మూ కశ్మీర్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రం భారీ సంఖ్యలో బలగాలను కశ్మీర్లో మోహరిస్తోంది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్‌ నుంచి యాత్రికులు, పర్యాటకులను వెనక్కి పంపిస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దుకు ప్రతిపాదన చేస్తున్నట్లు అమిత్ షా రాజ్యసభలో ప్రకటించారు. రాష్ట్రాన్ని విభజించి.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్ము-కశ్మీర్‌ ఏర్పడనుండగా.. అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్ అవతరించనుంది.

అమిత్‌ షా ప్రకటన వెలువడిన వెంటనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ ట్విటర్‌లో ప్రధాని నరేంద్రమోదీకి సంబంధించిన ఆసక్తికరమైన పాత ఫొటోను పోస్టు చేశారు.  యంగ్ ఏజ్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఓ కార్యక్రమంలో కూర్చొని ఉన్నారు. ఆర్టికల్‌ 370ను రద్దు చేయాలి.. ఉగ్రవాదాన్ని అంతమొందించాలని ఆయన వెనుక ఉన్న బ్యానర్‌లో రాసి ఉంది.  ఈ ఫొటోను పోస్టు చేసి.. ‘ప్రామిస్ నెరవేరింది’ అని రాం మాధవ్‌ క్యాప్షన్ పెట్టారు. ఆర్టికల్‌ 370కి వ్యతిరేకంగా  యంగ్ ఏజ్ ఉన్నప్పుడు నరేంద్రమోదీ ఆందోళన నిర్వహించారని ఆ ఫోటో స్పష్టం చేస్తుంది. నేడు ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్టికల్‌ 370 రద్దు అయిన నేపథ్యంలో ఆ ఫోటోను షేర్‌ చేసి క్యాప్షన్ పెట్టడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *