బెబ్బులి మళ్లీ పంజా విసిరింది…ఆసిఫాబాద్‌జిల్లాలో బాలికను పొట్టన పెట్టుకున్న పెద్ద పులి.. టైగర్‌ కారిడార్‌లో వణికిపోతున్న జనం

కొండపల్లికి చెందిన కొందరు మహిళలు ఈ ఉదయం పత్తిచేళ్లలో పనిచేసేందుకు పొలానికి వెళ్లారు. అటవీప్రాంతంలోని చెట్ల మధ్య నక్కి ఉన్న బెబ్బులి నిర్మల అనే బాలికపై దాడి చేసింది. అంతా తేరుకునేలోపే నోటకర్చుకుని అడవిలోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఈ సంఘటనతో కొండపల్లి గూడెం ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

బెబ్బులి మళ్లీ పంజా విసిరింది...ఆసిఫాబాద్‌జిల్లాలో బాలికను పొట్టన పెట్టుకున్న పెద్ద పులి.. టైగర్‌ కారిడార్‌లో వణికిపోతున్న జనం
Follow us

|

Updated on: Nov 29, 2020 | 4:14 PM

బెబ్బులి మళ్లీ పంజా విసిరింది. ఓ బాలికను పొట్టన పెట్టుకుంది. పొలంలో పనిచేస్తున్న కూలీలపై పెద్దపులి దాడి చేసింది. అమాంతం అడవిలోకి లాక్కెళ్లి..చంపేసింది. మనిషి రక్తానికి రుచి మరిగిన పులి…టైగర్‌ కారిడార్‌లో భయాందోళనలు సృష్టిస్తోంది. ఆసిఫాబాద్‌జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లి అటవీప్రాంతంలో కూలీలపై పెద్దపులి దాడి చేసింది.

కొండపల్లికి చెందిన కొందరు మహిళలు ఈ ఉదయం పత్తిచేళ్లలో పనిచేసేందుకు పొలానికి వెళ్లారు. అటవీప్రాంతంలోని చెట్ల మధ్య నక్కి ఉన్న బెబ్బులి నిర్మల అనే బాలికపై దాడి చేసింది. అంతా తేరుకునేలోపే నోటకర్చుకుని అడవిలోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఈ సంఘటనతో కొండపల్లి గూడెం ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

కొమురంభీం ఆసిఫాబాద్‌జిల్లాలో మనుషుల రక్తానికి రుచి మరిగిన పెద్దపులి వరుసగా దాడి చేస్తోంది. గత నెల 11 వ తేదీన అటవీప్రాంతంలో విఘ్నేష్‌ అనే యువకుడిపై పులి దాడి చేసి చంపేసింది. అప్పట్లో అటవీశాఖ అధికారులు టైగర్‌ను బంధించేందుకు బోన్లు , కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కేవలం 20 రోజుల వ్యవధిలో ఆరు పశువులను పులి దాడి చేసింది. ఇద్దరిని హతమార్చింది.

మ్యాన్‌ ఈటర్‌ మళ్లీ ఎటాక్‌ చేయడంతో టైగర్‌ కారిడార్‌లోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఎప్పుడు ఎటువైపు నుంచి బెబ్బులి దాడి చేస్తుందోనని ఇళ్లు విడిచి బయటకు వెళ్లడం లేదు. మరోవైపు అది మ్యాన్‌ ఈటర్‌ కాదని అప్పట్లో అటవీశాఖ అధికారులే ప్రకటించారు. అంతేకాదు టైగర్‌ జోన్‌లో తిరిగి పులి సరిహద్దు దాటిపోయి..మహారాష్ట్ర వైపు వెళ్లిపోయిందని ప్రకటించారు.

అయితే ఇప్పుడు దాడి చేసిన పులి…మొన్న దిగడలో అటాక్‌ చేసిన టైగర్‌ ఒక్కటే అయి ఉంటుందని ఫారెస్టు సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే …టైగర్‌ కారిడర్‌లో తిరుగుతున్న పులులు ఎన్ని..? ఒకటే ఉందా..లేక రెండు మూడు తిరుగుతున్నాయా..అనే అనుమానాలు కలుగుతున్నాయ్‌.

Latest Articles
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి