Korean Glowing Skin: కొరియన్ గ్లోయింగ్ స్కిన్ వెనుక అసలు రహస్యం ఇదే..

|

Aug 01, 2024 | 4:52 PM

ప్రస్తుత కాలంలో కొరియన్స్ గ్లాస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ గురించి పెద్ద చర్చే సాగుతుంది. ఎవరు చూసినా వీటీ గురించే మాట్లాడుకుంటున్నారు. లేడీస్ వీటిపై పెద్ద చర్చే మొదలు పెడుతున్నారు. కొరియన్ గ్లాస్ స్కిన్‌ కోసం ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కొరియన్స్‌రి అంత అందంగా మెరిసే చర్మం వెనుక ఓ టీ రహస్యం ఉంది. అదే కొంబుచా టీ. వినడానికి వింతగా ఉన్నా.. స్కిన్‌ అందంగా ఉండటం కోసం కొరియన్స్ ఈ టీ తాగుతారు. ఇది వారికి ఒక సాంప్రదాయ డ్రింక్‌గా..

Korean Glowing Skin: కొరియన్ గ్లోయింగ్ స్కిన్ వెనుక అసలు రహస్యం ఇదే..
Korean Glowing Skin
Follow us on

ప్రస్తుత కాలంలో కొరియన్స్ గ్లాస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ గురించి పెద్ద చర్చే సాగుతుంది. ఎవరు చూసినా వీటీ గురించే మాట్లాడుకుంటున్నారు. లేడీస్ వీటిపై పెద్ద చర్చే మొదలు పెడుతున్నారు. కొరియన్ గ్లాస్ స్కిన్‌ కోసం ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కొరియన్స్‌రి అంత అందంగా మెరిసే చర్మం వెనుక ఓ టీ రహస్యం ఉంది. అదే కొంబుచా టీ. వినడానికి వింతగా ఉన్నా.. స్కిన్‌ అందంగా ఉండటం కోసం కొరియన్స్ ఈ టీ తాగుతారు. ఇది వారికి ఒక సాంప్రదాయ డ్రింక్‌గా చెప్పొచ్చు. ఈ కొంబుచా టీ తాగితే కేవలం చర్మం మాత్రమే కాదు.. కురులు కూడా పట్టులా మారతాయి. ఇది పులియబెట్టిన పానీయం. ఇది దక్షిణ కొరియకు చెందినది. కానీ ఇప్పుడు ఈ టీ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. అసలు ఈ కొంబుచా టీ ఏంటి? కొరియన్లు ఎందుకు ఎక్కువగా ఈ టీ తాగుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

కొంబుచా టీ:

కొంబుచా టీని సాంప్రదాయ పానీయంగా వారు చెబుతారు. దీన్ని ‘టీ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ’ అని కూడా పిలుస్తారు. ఈ టీ తాగడం వల్ల ఆయుష్షు అనేది పెరుగుతుందట. ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా ఈ టీ ఉపయోగ పడుతుంది. ప్రేగులకు రక్షణ కూడా కల్పిస్తుంది. దక్షిణ కొరియాలో ఈ టీ తాగనిదే ఏ పనీ మొదలు పెట్టరు.

కొంబుచా టీలో ఏం ఉంటాయి:

కొంబుచా టీని పులియబెట్టి తయారు చేస్తారు. ఇది చాలా తియ్యగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండే బ్యాక్టీరియా, ఈస్ట్ వంటి వాటిని ఉపయోగిస్తారు. ఈ టీని తయారు కావడానికి రెండు వారాలు అంటే 14 రోజుల సమయం పడుతుంది. ఈ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, పలు పోషకాలు ఉంటాయి. ఈ టీ నలుపు లేదా గ్రీన్ కలర్‌లో ఉంటుంది. అంతే కాదు ఈ టీలో కొన్ని మూలికలు, పండ్లు సుగంధ ద్రవ్యాలను కూడా కలుపుతారు. ఈ టీ తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. అలాగే అందాన్ని పెంచడంలో కూడా ఈ టీ హెల్ప్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

కొంబుచా టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఉంటాయి. కాబట్టి శరీరంలో ఇమ్యూనిటీని బలోపేతం చేసి.. అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..