GHMC Election Results 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కంచికి చేరిన టీడీపీ కథ, కంచుకోటగా నిలిచిన ప్రాంతాల్లో సైతం గల్లంతు

బల్దియాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ 2020 ఎన్నికల్లో కనీసం ఎక్కడా సరైన పోటీ ఇవ్వలేకపోయింది. మొదటి నుంచి టీఆర్‌ఎస్‌,..

GHMC Election Results 2020 : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కంచికి చేరిన టీడీపీ కథ, కంచుకోటగా నిలిచిన ప్రాంతాల్లో సైతం గల్లంతు
Follow us

|

Updated on: Dec 05, 2020 | 6:05 AM

బల్దియాలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ 2020 ఎన్నికల్లో కనీసం ఎక్కడా సరైన పోటీ ఇవ్వలేకపోయింది. మొదటి నుంచి టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ముందే కీలక పోటీ కన్పించింది. మిగతా పార్టీలను ఎవ్వరూ లెక్కలోకి తీసుకోలేదు. అయినా కాంగ్రెస్‌ ఒకటి రెండు స్థానాల్లో తన ఉనికి చాటుకుంది. కానీ తెలుగుదేశం జాడ మాత్రం ఎక్కడా కన్పించ లేదు. గ్రేటర్‌లో తమ ఉనికి చాటుకునేందుకు ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గ్రేటర్‌ ఎన్నికల్లో 150 డివిజన్లకు గాను 106 డివిజన్లలో టీడీపీ తమ అభ్యర్థులను పోటీకి నిలిపింది. వివిధ సామాజికవర్గాల మధ్య బ్యాలెన్స్‌ పాటిస్తూ అభ్యర్థులను ప్రకటించింది. వెనుకబడిన తరగతులు, బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రచారంలో హంగూ, ఆర్భాటాలూ పెద్దగా లేకపోయినా గట్టిగానే కష్టపడ్డారు.

హైదరాబాద్‌ అభవృద్ధిలో టీడీపీ పాత్ర ఎంతో ఉందని గొంత చించుకున్నా… ఎందుకో ఓటర్ల చెవికెక్కలేదు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా నిలిచిన ప్రాంతాల్లో… ఇప్పుడు కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా సెటిలర్లపై టీడీపీ గంపెడాశలు పెట్టుకుంది. కానీ సెటిలర్లు ఎవ్వరూ సైకిల్‌ వైపు చూడనే లేదు. విస్తృతంగా ప్రచారం నిర్వహించినా… ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు చేయలేకపోయారు. కనీసం ఆకట్టుకునే నేతలను కూడా ప్రచారంలో దింపలేకపోయారు. మొదటి నుంచి గ్రేటర్‌ వార్‌ ప్రధానంగా మూడు పార్టీల మధ్యే ఉంటుందని అంతా భావించారు. ఇప్పుడు అదే జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో అప్పట్లో ఓ వెలుగు వెలిగిన పార్టీ కథ ఈ దెబ్బతో కంచికి చేరింది.

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..

వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?

అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం

కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌

ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..

మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్

హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి

కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు

వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో