టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు షాక్!

మొబైల్ సర్వీసు ప్రొవైడర్లకు ఎదురుదెబ్బ తగిలింది. టెలికాం కంపెనీలు తమ మునుపటి ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. “ఓపెన్ కోర్ట్ / ఓరల్ హియరింగ్‌లో విచారణ కోసం సమర్పించిన దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. సమీక్ష పిటిషన్లు, అనుసంధానించబడిన పత్రాలను శ్రద్ధతో పరిశీలించిన తరువాత, సమీక్ష పిటిషన్లను కొనసాగించడానికి మాకు ఎటువంటి సమర్థనీయమైన కారణం కనబడలేదు, కాబట్టి ఈ పిటిషన్లు తదనుగుణంగా కొట్టివేయబడతాయి,” అని సుప్రీంకోర్టు తెలిపింది. టెలికాం కంపెనీలు భారతి ఎయిర్‌టెల్, […]

టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు షాక్!
Follow us

| Edited By:

Updated on: Jan 16, 2020 | 10:11 PM

మొబైల్ సర్వీసు ప్రొవైడర్లకు ఎదురుదెబ్బ తగిలింది. టెలికాం కంపెనీలు తమ మునుపటి ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. “ఓపెన్ కోర్ట్ / ఓరల్ హియరింగ్‌లో విచారణ కోసం సమర్పించిన దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. సమీక్ష పిటిషన్లు, అనుసంధానించబడిన పత్రాలను శ్రద్ధతో పరిశీలించిన తరువాత, సమీక్ష పిటిషన్లను కొనసాగించడానికి మాకు ఎటువంటి సమర్థనీయమైన కారణం కనబడలేదు, కాబట్టి ఈ పిటిషన్లు తదనుగుణంగా కొట్టివేయబడతాయి,” అని సుప్రీంకోర్టు తెలిపింది. టెలికాం కంపెనీలు భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో సహా సుప్రీంకోర్టులో సమీక్ష పిటిషన్‌ను దాఖలు చేశాయి. గత తీర్పును సమీక్షించాల్సిన అవసరమేమి లేదని ధర్మాసనం వెల్లడించింది.

మొబైల్ సర్వీసు ప్రొవైడర్లు ప్రభుత్వానికి వేలకోట్లు బకాయిలు పడ్డాయి. కాగా.. టెలికం సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి సుమారు రూ.92వేల కోట్ల మేర సవరించిన స్థూల ఆదాయం(ఏజీఆర్‌) వసూలు చేసేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. దీంట్లో అత్యధికంగా ఎయిర్‌టెల్‌ రూ.21,682.13కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.19,823కోట్లు, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రూ.16,456కోట్లు, ఎంటీఎన్‌ఎల్‌ రూ.2,537కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2,098కోట్లు బకాయి పడ్డాయి. వీటిపై వడ్డీలు, అపరాధ రుసుంలు కలిపి మొత్తం రూ.92,641కోట్లకు చేరాయి. వీటికి తోడు మరో రూ.55,054కోట్లు స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు కలిశాయి. మొత్తం రూ.1.47లక్షల కోట్లు చెల్లించాల్సి వచ్చింది. అపరాధ రుసుం, వడ్డీ నుంచి మినహాయించాలని ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.