గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోండి…తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవరించిన సుప్రీం కోర్టు

తెలంగాణ‌లో దీపావ‌ళి వేళ రెండు గంట‌ల పాటు గ్రీన్ క్రాక‌ర్స్ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. త‌క్కువ స్థాయిలో కాలుష్యం విడుద‌ల చేసే ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన బాణసంచా పేల్చేందుకు...

గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోండి...తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవరించిన సుప్రీం కోర్టు
Follow us

|

Updated on: Nov 13, 2020 | 4:52 PM

Supreme Court Allows Green Crackers : తెలంగాణ‌లో దీపావ‌ళి వేళ రెండు గంట‌ల పాటు గ్రీన్ క్రాక‌ర్స్ కాల్చుకునేందుకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. త‌క్కువ స్థాయిలో కాలుష్యం విడుద‌ల చేసే ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన బాణసంచా పేల్చేందుకు అత్యున్న‌త న్యాయ‌స్థానం అనుమతి ఇచ్చింది. దీంతో బాణసంచా నిషేధం అంశంలో తెలంగాణ ఫైర్‌ వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌కు ఊరట లభించింది.

బాణసంచాను నిషేధిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించింది. గాలి నాణ్యత సూచీల ఆధారంగా టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ తెలంగాణ ఫైర్‌ వర్క్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది.

దీనిపై జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసం విచారణ చేపట్టింది. ఈనెల 9న జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు ఆదేశాలను సవరిస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

గాలి నాణ్యత సాధారణంగా ఉన్నచోట రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గ్రీన్‌ క్రాకర్స్‌కు అనుమతించింది. ఎన్జీటీ మార్గదర్శకాల ప్రకారమే తెలంగాణలో టపాసులపై ఆంక్షలు విధిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.