బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదలైంది. ఇంకా ఆయన వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో ఐసీయూలోనే ఉన్నారని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్
Follow us

|

Updated on: Aug 22, 2020 | 8:17 PM

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదలైంది. ఇంకా ఆయన వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో ఐసీయూలోనే ఉన్నారని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనా పోరాడుతూ ఎస్పీబీ చెన్నైలో ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూకి తరలించిన చికిత్స అందిస్తున్నారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటికీ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో చికిత్స పొందుతున్నారని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. నిపుణులైన వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని… ఈ వైద్యు టీమ్‌లో ఇంటర్నల్‌ మెడిసన్‌, క్రిటికల్‌ కేర్‌, పల్మనాలజీ, ఇన్ఫెక్టివ్‌ డీసీజెస్‌, ఎక్మోకేర్‌లో విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు ఉన్నారని తెలిపారు. వీరంతా అంతర్జాతీయస్థాయి వైద్యులతో నిరంతరం అనుసంధానమై ఉంటున్నారని పేర్కొంది.

యూకే, యూఎస్‌లో ఎంతోమంది కరోనా రోగులకు ఎక్మో సాయంతో అక్కడి వైద్యులు చికిత్స చేశారని తెలిపింది. బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యం మెరుగుపడటానికి ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తీసుకుంటున్న చర్యలపై కూడా వారు సంతోషం వ్యక్తం చేశారు అని ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు.