డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న నెల్లూరు జిల్లా వరప్రదయాని.. వరద ప్రవాహంతో మారిన సోమశిల రూపురేఖలు

నెల్లూరు జిల్లాకు వరప్రదయాని సోమశిల రిజర్వాయర్. ఇటు సింహపురి, తిరుపతి, చెన్నై నగర దాహార్తికి ప్రధాన వనరు సోమశిల. అలాంటి రిజర్వాయర్‌ ఇప్పుడు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది.

డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న నెల్లూరు జిల్లా వరప్రదయాని.. వరద ప్రవాహంతో మారిన సోమశిల రూపురేఖలు
Follow us

|

Updated on: Jan 06, 2021 | 8:40 PM

Somasila Dam : సోమశిల జలాశయానికి ఇటీవల వచ్చిన భారీ వరద ప్రవాహం కారణంగా జలాశయం పూర్తిగా రూపురేఖలు మారిపోయి ప్రమాద పరిస్థితి చేరుకుంది. వరద ఉధృతి ప్రవాహం కారణంగా ఎంతో పటిష్టంగా ఉన్న కాంక్రీట్ దిమ్మలు సైతం నీటి ప్రవాహానికి కరిగిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాంక్రీట్ ఫ్లోర్స్ ఫ్లాట్ ఫామ్ అన్నీ కూడా సుమారు పది అడుగుల మేర గుంతలు పడి లేచి పోయాయి.వరద ఉధృతికి భారీ రాళ్ళు కూడా కరిగిపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.

రెండేళ్ల క్రితం సుమారు 17 కోట్లతో నిర్మించిన కాంక్రీట్ కట్టడాలు సైతం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు సైతం జలాశయ స్థితిని చూసి అయ్యో అంటున్నారు. భారీ వరద బీభత్సం కారణంగా జలాశయం గేట్లు తప్ప… సిమెంట్ కాంక్రీట్ మొత్తం పూర్తిగా కొట్టుకుపోవడం ఆందోళనకు గురి చేస్తుంది. రాష్ట్రంలో మిగిలిన జలాశయాలు నిర్మించిన ప్రాంతాలు ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి కలగకపోవడం విశేషం.

జలాశయం ముందు వైపున 1, 2 గేట్ల ముందు వైపు ఉండే నీటి ప్రవాహం కి కొంతమేర తగ్గింపు గా ఉండే సేఫ్టీ వాల్ సైతం సుమారు 10 మీటర్ల మేర కోతకు గురి కావడం మరో ఆందోళన.. జలాశయం ప్రాంతం ప్రస్తుతం భూకంపం వచ్చిన ప్రాంతాన్ని తలపిస్తోంది..ప్రస్తుతం వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టి ఉన్నకారణంగా యుద్ధ ప్రాతిపదికన గా త్వరగా జలాశయం ముందువైపు నిర్మాణం చేపట్టకపోతే జలాశయం సామర్ధ్యత ప్రశ్నార్థకంగా మారుతుంది అని కొందరు ఇంజనీర్లు తెలుపుతున్నారు.