జూపార్కులో మూడు పిల్లలకు జన్మనిచ్చిన పులి

|

Aug 13, 2020 | 9:39 AM

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరంలోని వన్యప్రాణుల జాతీయ వనంలో షీలా అనే పులి మూడు కూనలకు జన్మనిచ్చింది.

జూపార్కులో మూడు పిల్లలకు జన్మనిచ్చిన పులి
Follow us on

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురి నగరంలోని వన్యప్రాణుల జాతీయ వనంలో షీలా అనే పులి మూడు కూనలకు జన్మనిచ్చింది. దీంతో సిలిగురి జూపార్కులో పులుల సంఖ్య ఏడుకు పెరిగింది. షీలాతోపాటు కూనల ఆరోగ్యం బాగా ఉందని సిలిగురి జూపార్కు డైరెక్టరు ధరండియో రాయ్ చెప్పారు. కరోనా ప్రభావంతో మార్చి నుంచి సిలిగురి జూపార్కును మూసివేశారు అధికారులు. 297 హెక్టార్లలో విస్తరించి ఉన్న సిలిగురి జూపార్కులో సింహాల కోసం ప్రత్యేకంగా సఫారీ ఏర్పాటు చేశారు. ఈ జూపార్కులో ఖడ్గమృగాలు, ఏనుగులు, జింకలను పెంచుతున్నారు. పులి కూనలు మూడు కేరింతలు కొడుతూ సఫారీ కలయ తిరుగుతున్నాయని జూ అధికారలు తెలిపారు. జూపార్కు పునర్ ప్రారంభించాక పులి పిల్లలు సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అటవీశాఖ మంత్రి రిజిబ్ బెనర్జీ చెప్పారు. 2018 మే నెలలో ఈ పులి మూడు కూనలకు జన్మనిచ్చింది. అప్పట్లో మూడు పులి పిల్లలకు ఇక, కిక, రిక అని సీఎం మమతాబెనర్జీ పేర్లు పెట్టారు. వీటిలో ఇక కొన్ని నెలల క్రితం మరణించింది. కూనలకు జన్మనిచ్చిన షీలాతోపాటు మగపులి విబన్ లను భువనేశ్వర్ లోని నందనకాన్ జూపార్కు నుంచి తీసుకువచ్చారు. అటు ప్రభుత్వ ప్రభుత్వ పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.