ఇంట్లోని టేబుల్ కింద విషపూరితమైన కాలనాగు

|

Aug 13, 2020 | 9:24 AM

అత్యంత ప్రమాదకారి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విష సర్పాలు సమీపంలోని గ్రామాల్లోని ఇళ్లల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఓ ఇంట్లో అత్యంత విషపూరితమైన తాచుపాము ప్రత్యక్షమైన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ నగరంలో వెలుగుచూసింది.

ఇంట్లోని టేబుల్ కింద విషపూరితమైన కాలనాగు
Follow us on

అత్యంత ప్రమాదకారి జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో విష సర్పాలు సమీపంలోని గ్రామాల్లోని ఇళ్లల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఓ ఇంట్లో అత్యంత విషపూరితమైన తాచుపాము ప్రత్యక్షమైన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ నగరంలో వెలుగుచూసింది. నైనిటాల్ నగరంలోని ఓ ఇంట్లో టేబుల్ కిందకు అతిపెద్ద తాచు పాము వచ్చి చేరింది. ఈ పామును చూసిన కుటుంబసభ్యులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంకు సమాచారం అందించారు. దీంతో నైనిటాల్ అటవీశాఖ అధికారి ఆకాష్ కుమార్ వర్మతోపాటు వాలంటీర్ వచ్చి అత్యంత చాకచక్యంగా విషనాగును పట్టుకొని సంచిలో బంధించారు. అనంతరం పామును అటవీప్రాంతంలో వదిలేశారు. అతిపెద్ద పామును పట్టుకొని వదిలేసిన వీడియోను చిత్రీకరించిన డీఎఫ్ఓ దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఇది అత్యంత అరుదైన విషపూరితమైన పాముగా అధికారులు వెల్లడించారు. జోరుగా వర్షాలు కురుస్తున్నందున జనం అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.