కార్తీక మాసం..తొలి సోమవారం

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకం..అందులోనూ సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. ప్రతి యేటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్ధశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు విశేషంగా […]

కార్తీక మాసం..తొలి సోమవారం
Follow us

|

Updated on: Oct 28, 2019 | 4:39 PM

శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీకం..అందులోనూ సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టం. ప్రతి యేటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్ధశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు విశేషంగా పూజలు చేస్తుంటారు. కార్తీకమాసం వచ్చిందంటే ఆ నెల రోజులూ పండుగదినాలే. దేశ నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు.

ఇక, కార్తీకమాసం మొదటి సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. భ్రమరాంబ మళ్లికార్జున స్వామివారి సాధారణ దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం టోకన్లు తీసుకున్న భక్తులు క్యూలో మూడు గంటలు వేచి చూడాల్సి వస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగటలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటున్నారు. అలాగే నాగులకట్ట దగ్గర మహిళలు కార్తీక నోములు నోచుకున్నారు. కాళేశ్వరం, వేములవాడ ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. ఇక, పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, పాలకొల్లు, భృమవరం, సామర్లకోట, అమరావతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పంచారామాలను ఒకే రోజు దర్శనం చేసుకుంటే జ్యోతిర్లాంగాలను దర్శించిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు. పశ్చమగోదావరి జిల్లా జుత్తిగ ఉమావాసుకిరవి సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నత్తారామేశ్వరం శ్రీరామేవ్వరస్వామీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా యానాంలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్బంగా శ్రీ రాజరాజేశ్వర  స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అలాగే అన్నవరం రమా సత్యనారాయణ స్వామి సన్నిధిలో తెల్లవారుజాము నుంచే కార్తీక దీపాలు వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ వ్రతాల కోసం భక్తులు బారులు తీరారు.

తెలుగోడి మెరుపు ఇన్నింగ్స్ వృథా.. మళ్లీ ఓడిన ముంబై ఇండియన్స్
తెలుగోడి మెరుపు ఇన్నింగ్స్ వృథా.. మళ్లీ ఓడిన ముంబై ఇండియన్స్
అబద్ధాలతో కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి ఫైర్
అబద్ధాలతో కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి ఫైర్
10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్ విడుదలకు సర్వం సిద్ధం..
10వ తరగతి విద్యార్థులకు అలర్ట్.. రిజల్ట్ విడుదలకు సర్వం సిద్ధం..
వృషభ రాశిలోకి బృహస్పతి సంచారం.. వారి జీవితంలోకి ధన లక్ష్మి..
వృషభ రాశిలోకి బృహస్పతి సంచారం.. వారి జీవితంలోకి ధన లక్ష్మి..
దిండు కింద తులసి ఆకుల్ని పెట్టుకుని పడుకుంటే.. ఊహించని ప్రయోజనాలు
దిండు కింద తులసి ఆకుల్ని పెట్టుకుని పడుకుంటే.. ఊహించని ప్రయోజనాలు
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI
లక్నోతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్.. ఇరు జట్ల ప్లేయింగ్-XI
12 దేశాలకు కనెక్టివిటీ అందించే ప్రత్యేక ఫ్లైట్.. విశాఖలో ప్రారంభం
12 దేశాలకు కనెక్టివిటీ అందించే ప్రత్యేక ఫ్లైట్.. విశాఖలో ప్రారంభం
మేనిఫెస్టో మంత్రం! ఆచరణసాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?
మేనిఫెస్టో మంత్రం! ఆచరణసాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?
2 ఓవర్లలో 41 రన్స్.. హార్దిక్ చెత్త బౌలింగ్.. ప్రపంచకప్‌లో ఆడేనా?
2 ఓవర్లలో 41 రన్స్.. హార్దిక్ చెత్త బౌలింగ్.. ప్రపంచకప్‌లో ఆడేనా?
వేసవిలో డిటాక్స్‌ వాటర్‌ తాగండి..ఆరోగ్యంతో పాటు అందానికి మ్యాజిక్
వేసవిలో డిటాక్స్‌ వాటర్‌ తాగండి..ఆరోగ్యంతో పాటు అందానికి మ్యాజిక్
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తూ చాపర్‌లో కింద పడిపోయిన దీదీ..
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.