అనసూయని వరించిన అవార్డులు ఇవే..
TV9 Telugu
27 April 2024
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ యాంకర్ గా తన అందం, చలాకితనం, మాటలతో బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది అనసూయ భరద్వాజ్.
యాంకర్ గా మాత్రమే సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. రంగస్థలంలో రంగమ్మ అత్తగా, పుష్పాలో దాక్షాయణిగా, మరెన్నో పాత్రల్లో వెండితెరపై సందడి చేసింది.
వెండితెరపై నటనకు కొన్ని అవార్డ్స్ కూడా అందుకుంది. ఈ ముద్దుగుమ్మ అందుకున్న అవార్డ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
2017లో రెండవ IIFA ఉత్సవ్ వేడుకల్లో క్షణం చిత్రంలో ఈమె నటనకి ఉత్తమ సహాయనటి అవార్డును కైవసం చేసుకుంది ఈ భామ.
అదే ఏడాది అరవ SIIMA అవార్డ్స్ వారిచే మరోసారి క్షణంలో ఈ వయ్యారి నటనకుగాను ఉత్తమ సహాయనటి అవార్డు అందుకుంది.
2019లో రంగస్థలంలో ఈ బ్యూటీ చేసిన రంగమ్మ అత్తా పాత్రకు 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ వారు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ తో పురస్కరించారు.
అదే సంవత్సరం రంగస్థలంలో ఈమె నటనకి ఎనిమిదవ SIIMA అవార్డ్స్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది.
మరోసారి అదే ఏడాది రంగస్థలం సినిమాకు మోరోసారి జీ సినీ అవార్డ్స్ తెలుగు వారిచే ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి