ఏపీలో ఇవాళ్టి నుంచి స్కూల్స్‌ ప్రారంభం

ఏపీలో ఇవాళ్టి నుంచి స్కూల్స్‌ ప్రారంభమవుతున్నాయి. కరోనా ప్రభావంతో గత ఏడున్నర నెలలుగా పాఠశాలలు మూతపడిన సగతి తెలిసిందే. తొలుత 9,10 తరగతులతో పాటు ఇంటర్‌ క్లాసులు స్టార్ట్‌ అవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇక నవంబర్‌ 23 నుంచి 6,7,8 క్లాసులు జరుగుతాయని తెలిపారు. డిసెంబర్‌ 14 నుంచి 1నుంచి 5 తరగతులు స్టార్ట్‌ అవుతాయని… నవంబర్‌ 16 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం […]

ఏపీలో ఇవాళ్టి నుంచి స్కూల్స్‌ ప్రారంభం
Follow us

|

Updated on: Nov 02, 2020 | 7:57 AM

ఏపీలో ఇవాళ్టి నుంచి స్కూల్స్‌ ప్రారంభమవుతున్నాయి. కరోనా ప్రభావంతో గత ఏడున్నర నెలలుగా పాఠశాలలు మూతపడిన సగతి తెలిసిందే. తొలుత 9,10 తరగతులతో పాటు ఇంటర్‌ క్లాసులు స్టార్ట్‌ అవుతున్నాయని అధికారులు వెల్లడించారు. ఇక నవంబర్‌ 23 నుంచి 6,7,8 క్లాసులు జరుగుతాయని తెలిపారు. డిసెంబర్‌ 14 నుంచి 1నుంచి 5 తరగతులు స్టార్ట్‌ అవుతాయని… నవంబర్‌ 16 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ తరగతులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. కొవిడ్‌ నిబంధనలకు లోబడి తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఒక్కో తరగతి గదిలో 16 మంది వరకే అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలల్లో గదులు సిద్ధం చేశారు విద్యాశాఖ అధికారులు. బెంచీకి ఒకరు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. పదో తరగతి విద్యార్థులు పాఠశాలకు రోజూ రావాలి. 9వ తరగతి విద్యార్థులు రోజు విడిచి రోజు హాజరుకావాల్సి ఉంటుంది. విద్యార్థుల హాజరుపై తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి కావడంతో ముందురోజే సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఉపాధ్యాయులను అధికారులు హెచ్చరించారు. దాంతోపాటు ప్రతి ఒక్క విద్యార్థి మాస్కు ధరించాలని సూచించారు. ఇక భౌతికదూరం పాటించడంతోపాటు శానిటైజర్‌, థర్మల్‌ స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అటు అన్ని కళాశాలలోనూ కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు ఆదేశించారు. విద్యార్థులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. కాలేజీలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు థర్మల్‌ స్కానింగ్‌ చేశాకే తరగతి గదుల్లోకి విద్యార్థులను అనుమతించాలి. ఆరడుగుల దూరంలో విద్యార్థులను కూర్చోబెట్టాలి. కళాశాలలను పూర్తిగా శానిటైజేషన్‌ చేయాలి. గ్రూపులుగా విద్యార్థులు ఉండకుండా చర్యలు తీసుకోవడంతోపాటు మొదటి నుంచి చివరి వరకు వారిని మార్చకుండా ఒకే తరగతి గదిలో ఉంచాలని సూచించారు.