నీ తరంలోనే అథ్లెట్‌ అయినందుకు గర్విస్తున్నా…

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించారు. ధోనీ ఆడిన తరంలోనే తాను కూడా ఒక అథ్లెట్‌ అయినందుకు గర్వపడుతున్నట్లు....

నీ తరంలోనే అథ్లెట్‌ అయినందుకు గర్విస్తున్నా...
Follow us

|

Updated on: Aug 17, 2020 | 2:33 PM

ధోనీ రిటైర్మెంట్‌ను క్రీడాభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. అమిత్ షా నుంచి సామాన్య ఆటగాడి వరకు అంతా ధోనీని స్మరిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అయితే ఇదే వరసలో సానియా మీర్జా కూడా చేరారు.

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించారు. ధోనీ ఆడిన తరంలోనే తాను కూడా ఒక అథ్లెట్‌ అయినందుకు గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు సానియా మ . మహీద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

‘ధోనీ నువ్వో దిగ్గజం. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ క్రీడాకారుల్లో నువ్వూ ఒకడివి. దేశం కోసం నువ్వు చేసిన సేవకు ధన్యవాదాలు. అలాగే నీ భవిష్యత్‌ మరింత బాగుండాలని ఆశిస్తున్నా. నువ్వు ఆడిన తరంలోనే, ఇదే దేశం తరఫున నేను కూడా ఒక క్రీడాకారిణి అయినందుకు గర్విస్తున్నా’ అని పేర్కొంది.

అనూహ్య నిర్ణయంతో యావత్‌ క్రీడాలోకాన్ని షాక్‌కు గురిచేసిన మిస్టర్ కూల్ ధోనీకి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) శుభాకాంక్షలు తెలిపింది. ఒక తరానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన ధోనీ ఆటను మిస్‌ అవుతున్నామని ఐసీసీ సీఈవో మను సాహ్నీ పేర్కొన్నారు. ఎంఎస్‌ ధోనీ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ఆటగాళ్లలో ధోనీ ఒకడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో అతడు కొట్టిన విన్నింగ్‌ షాట్‌ ప్రపంచ క్రికెట్‌ అభిమానుల మనసులో ఎప్పటికీ అలా నిలిచి ఉంటుంది.. అతడు మొత్తం తరానికి స్ఫూర్తిగా నిలిచాడు. అతడి ఆటను మిస్సవుతాం. ఈ సందర్భంలో అతడికి శుభాకాంక్షలు. భవిష్యత్తులో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నా అని సాహ్నీ పేర్కొన్నారు.

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..