Rupee Gains: పెరిగిన రూపాయి విలువ… లాభపడింది ఎంతో తెలుసా..? పడిపోయిన డాలర్ విలువే కారణమా..?

ఏడాది చివరన భారత ఆర్థిక రంగానికి ఊరట లభించింది. సెన్సెక్స్ నిఫ్ట్ లాభాల్లో ట్రేడ అవగా... డాలర్ మారకంతో రూపాయి విలువ పెరిగింది.

Rupee Gains: పెరిగిన రూపాయి విలువ... లాభపడింది ఎంతో తెలుసా..? పడిపోయిన డాలర్ విలువే కారణమా..?
Follow us

| Edited By:

Updated on: Jan 01, 2021 | 5:27 AM

ఏడాది చివరన భారత ఆర్థిక రంగానికి ఊరట లభించింది. సెన్సెక్స్ నిఫ్ట్ లాభాల్లో ట్రేడ అవగా… డాలర్ మారకంతో రూపాయి విలువ పెరిగింది. డిసెంబర్ 31న ఉదయం సెషన్లో డాలర్‌తో రూపాయి వ్యాల్యూ 16 పైసలు లాభపడి 73.15 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 73.31 వద్ద క్లోజ్ అయింది. నేడు ఓ సమయంలో 25 పైసలు బలపడి 73.06 వద్ద ట్రేడ్ అయింది. ఇది రెండు నెలల గరిష్టం. మొత్తంగా చూస్తే డాలర్ మారకంతో 11 పైసలు లాభఫడి 73.31 వద్ద ముగిసింది.

కారణం ఇదేనా…?

అమెరికాలో కరోనా ప్రభావం, ఆర్థిక ప్యాకేజీ వంటి వివిధ కారణాల వల్ల సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ రెండేళ్ల కనిష్టానికి చేరుకుంది. రూపాయి బలపడటానికి ఇది ప్రధాన కారణం. అలాగే, దేశీయ ఈక్విటీ కూడా కారణం. ఏప్రిల్ 2018 తర్వాత సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ 0.074 శాతం క్షీణించి 89.528కి పడిపోయింది. డాలర్ 90 దిగువకు పడిపోయింది. అంతేకాకుండా, ఆసియా దేశాల కరెన్సీలు పుంజుకోవడం కలిసి వచ్చింది. ప్రధానంగా చైనా తయారీ రంగం జోరందుకోవడంతో డాలర్ మారకంతో యువాన్ 6.54ను తాకింది. మరోవైపు, సెప్టెంబర్ నాటికి కరెంట్ ఖాతా 15.5 బిలియన్ డాలర్ల మిగులుకు చేరిందన్న ఆర్బీఐ వెల్లడించడం కలిసి వచ్చింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇలాంటి అంశాలు రూపాయి బలపడటానికి దోహదపడ్డాయి.

Also Read:

Asia’s richest person: ఇకపై ఆసియా కుబేరుడు ముకేశ్ కాదు.. అతణ్ని వెనక్కి నెట్టింది ఎవరో తెలుసా.?