చిరంజీవికి రోజా స్పెషల్ విషెష్ ..

|

Aug 22, 2020 | 10:13 PM

మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజును ఘనంగా జరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌తోపాటు సినిమా రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు తెలిపినవారిలో ఉన్నారు. ఈ లిస్ట్ లో నటి మరియు వైసీపీ..

చిరంజీవికి రోజా స్పెషల్ విషెష్ ..
Follow us on

మెగాస్టార్ చిరంజీవి తన 65వ పుట్టినరోజును ఘనంగా జరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌తోపాటు సినిమా రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షలు తెలిపినవారిలో ఉన్నారు. ఈ లిస్ట్ లో నటి మరియు వైసీపీ ఎమ్మెల్యే రోజు కూడా ఉన్నారు. ఆమె సోషల్ మీడియాలో చిరంజీవికి తనదైన తరహాలో శుభాకాంక్షలు తెలిపారు. “స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగి ఎందరో నటులకు ఆదర్శంగా నిలిచిన మా చిరుగారికి జన్మదిన శుభాకాంక్షలు” అని రోజా ట్వీట్ చేశారు.


సోషల్ మీడియా వేదికగా ఆయనకు  శుభాాకాంక్షలు వెల్లువెత్తాయి.  సోషల్ మీడియాలో చిరు
బర్త్ డేని ఫ్యాన్స్ సెలెబ్రేట్  అదిరిపోయింది. ఒకరిని మించి మరొకరు అభినందనలు తెలిపారు. అలాగే వారి కోసం చిరు లేటెస్ట్ మూవీ ఆచార్య ఫస్ట్ లుక్‌ అండ్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ధర్మస్థలి అనే ఓ పురాతన ఆర్చ్ ముందు కత్తితో శత్రువులను వెంటాడుతున్న చిరంజీవి లుక్  అదిరిందని  అంటున్నారు మెగా ఫ్యాన్స్.

ఇక ఆయన మెడలో ఎర్ర కండువా విప్లవభావాలు కలిగిన వాడిగా ప్రొజెక్ట్ చేస్తుంది. మొత్తంగా మోషన్ పోస్టర్ తోనే చిరు మూవీపై హైప్ పెంచేశారు.  ఫ్యాన్స్ తో పాటు, సినీ మరియు రాజకీయ ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.