ఏపీఐసీసీ ఛైర్​పర్సన్​గా రోజా.. కాసేపట్లో బాధ్యతల స్వీకరణ

| Edited By:

Jul 15, 2019 | 7:51 AM

ఏపీఐసీసీ ఛైర్​పర్సన్​గా చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం… నేరుగా కార్యాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపడతారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్​గా నియమిస్తూ ఈ నెల 10న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఈ […]

ఏపీఐసీసీ  ఛైర్​పర్సన్​గా రోజా.. కాసేపట్లో బాధ్యతల స్వీకరణ
Follow us on

ఏపీఐసీసీ ఛైర్​పర్సన్​గా చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం… నేరుగా కార్యాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపడతారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్మన్​గా నియమిస్తూ ఈ నెల 10న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఈ పదవిలో రోజా కొనసాగనున్నారు.