ఆస్ట్రేలియాలో భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో రిక్టర్ స్కేలు పై భూకంప తీవ్రత 5.5 గా నమోదైందని అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. హిందూ మహాసముద్రానికి చేరువలో పది కిలోమీటర్ల లోతులో నుంచి భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆదివారం ఆస్ట్రేలియాలో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. సోమవారం ఉదయం సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి సునామీ ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.