RR vs DC రాజస్థాన్, ఢిల్లీ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్
రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. షార్జా వేదికగా మరికాసేపట్లో జరగబోయే ఈ మ్యాచ్‌లో గెలిచి.... పాయింట్స్ టేబుల్లో పైకి ఎగబాకాలని చూస్తోంది రాయల్స్. మరోవైపు టాప్ ప్లేస్‌పై కన్నేసింది ఢిల్లీ క్యాపిటల్స్.
RR vs DC : రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. షార్జా వేదికగా మరికాసేపట్లో జరగబోయే ఈ మ్యాచ్‌లో గెలిచి…. పాయింట్స్ టేబుల్లో పైకి ఎగబాకాలని చూస్తోంది రాయల్స్. మరోవైపు టాప్ ప్లేస్‌పై కన్నేసింది ఢిల్లీ క్యాపిటల్స్.
రాజస్థాన్ రాయల్స్ స్థాయి తగ్గట్లుగా ఆడట్లేదు. స్టీవ్ స్మిత్, సంజు సామ్సన్ కూడా ఫెయిలవడం టీమ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసినప్పటికీ.. ఫలితం మాత్రం మారలేదు. బౌలింగ్ లోనూ భారీగా పరుగులు ఇస్తున్నారు. అయితే రాజస్థాన్‌కు షార్జా కలిసొచ్చిన స్టేడియం. మరి ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతారనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
ఢిల్లీ వరుస విజయాలతో జోరు మీదుంది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ విభాగాలు బలంగా ఉన్నాయి. ఓపెనర్లు పృథ్వీ షా, ధావన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో పంథ్ చెలరేగి ఆడుతున్నారు. వీరికి షార్జా లాంటి పించ్ దొరికితే ఇక పరుగుల వరదే అంటున్నారు విశ్లేషకులు.