మంచి మెసేజ్ ఓరియెంటెడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రో సినిమా పై హాట్ కామెంట్స్ చేసారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక సినిమాల్లో డైలాగులు డాన్సులు చేయించారని కౌంటర్ వేశాడు. కావాలనే తనను టార్గెట్ చేసి నటుడు పృథ్వితో ఇలా చేయించారని సీరియస్ అయ్యారు. ఈ హాట్ కామెంట్స్ పై టీవీ9తో స్పందించారు బ్రో మూవీ ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్. కావాలనే హిట్ టాక్ తో ముందుకు వెళ్తున్న సినిమాపై కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. సినిమా ఎడిటింగ్ టైం లో చాలా సార్లు చూశానని ఎక్కడ ఎలాంటి కాంట్రవర్సీ అనిపించలేదు అని టీవీ9 తో అన్నారు. పాలిటిక్స్ కి ఎలాంటి సబందం లేదని మంచి మెసేజ్ తో ఉన్న సినిమా పై ఇలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు మూవీ ప్రొడ్యూసర్.
సినిమా డైలాగులు కానీ డాన్సులు కానీ ఎవరిని ఉద్దేశించినవి కావాలి సినిమాలో కంటిన్యూ భాగంగానే ఉన్నాయని చెప్పారు సినిమా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్.తన వరకు కేవలం సినిమా లో బాగంగా ఉన్న క్యారెక్టర్ మాత్రమే. ఆ క్యారెక్టర్ డాన్స్ లో హ్యూమర్ ఉంది.నేను చాలా సార్లు సినిమా చూసినప్పుడు ఒక ఫ్లోలో లో ఉంది ఎలాంటి కంపారిజన్ అనిపించడం లేదు.
సినిమా మొత్తం లో ఎక్కడ పొలిటికల్ ఇష్యూ లేదు. ఇది ఒక సిచువేషన్ కాంట్రవర్సీ మాత్రమే. భూతద్దంలో పెట్టి చూడడమే తప్ప ఎక్కడ ఎలాంటి పొలిటికల్ కాంట్రవర్సి ఏమీ లేదు.