“మోదీ స్కూటీ యోజన” తుస్.. అంతా రూమరే..

| Edited By:

Jul 17, 2019 | 12:59 PM

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం స్కూటీ యోజనను ప్రారంభించిందని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పదోతరగతి పాసైన విద్యార్థినిలకు ఈ పథకం కింద స్కూటీని ఇస్తారంటూ తెగ హల్ చల్ చేస్తోంది. ఈనెల 30 చివరి తేదీ అంటూ కొందరు ఆ వార్తను ఫార్వర్డ్ చేస్తున్నారు. దీంతో కొంతమంది దరఖాస్తులు చేసుకోవడానికి పోటీపడుతుంటే.. మరికొంతమంది ఈ పథకాన్ని మిస్సై పోతున్నామని బాధపడుతున్నారు. అయితే అమ్మాయిలు […]

మోదీ స్కూటీ యోజన తుస్.. అంతా రూమరే..
Follow us on

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం స్కూటీ యోజనను ప్రారంభించిందని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. పదోతరగతి పాసైన విద్యార్థినిలకు ఈ పథకం కింద స్కూటీని ఇస్తారంటూ తెగ హల్ చల్ చేస్తోంది. ఈనెల 30 చివరి తేదీ అంటూ కొందరు ఆ వార్తను ఫార్వర్డ్ చేస్తున్నారు. దీంతో కొంతమంది దరఖాస్తులు చేసుకోవడానికి పోటీపడుతుంటే.. మరికొంతమంది ఈ పథకాన్ని మిస్సై పోతున్నామని బాధపడుతున్నారు. అయితే అమ్మాయిలు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అసలు ఈ పథకాన్ని ప్రవేశపెట్టలేదు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వస్తున్న వార్తలు పుకార్లు మాత్రమేనని అధికారులు తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ ఏడాది మే నుంచే పథకం ప్రారంభమైందని.. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో చెబుతున్నారు. కాని, నిజానికి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మే 23 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అయితే రెండో సారి మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టింది మే 30. దీన్నిబట్టి ఏ పథకాన్ని ప్రవేశ పెట్టేందుకు అవకాశం లేదు.

నిజానికి తమిళనాడులో గతేడాది ఆ రాష్ట్ర ప్రభుత్వం అమ్మ స్కూటీ యోజనను ప్రారంభించింది. మాజీ సీఎం జయలలిత 70వ జయంతి సందర్భంగా, ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆ పథకాన్ని మొదలుపెట్టారు. రెండున్నర లక్షలోపు ఆదాయం ఉన్న వితంతువులు, దివ్యాంగుల కోసం తీసుకొచ్చిన పథకం ఇది. దీంతో కొందరు మోదీ ఫోటోను వాడుకుని స్కూటీ యోజన అంటూ ప్రచారం చేస్తున్నారు. పథకాన్ని ప్రవేశపెట్టి వుంటే ప్రభుత్వమే స్వయంగా ప్రచారం చేస్తుందని.. కాబట్టి ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మ వద్దంటూ అధికారులు తెలిపారు.