పార్లమెంటులో ఏపీకి ‘ వరాలు ‘

| Edited By: Srinu

Jul 17, 2019 | 12:38 PM

ఏపీలో ఓ సెంట్రల్ యూనివర్సిటీని, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు మంగళవారం ఆమోదించింది. మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈ మేరకు బిల్లును ప్రతిపాదించగా.. దీనికి ఆమోద ముద్ర లభించింది. వచ్ఛే నాలుగేళ్లలో వీటిని ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. సెంట్రల్ యూనివర్శిటీస్ (సవరణ) బిల్లు-2019 ని రాజ్యసభలో మూజువాణీ ఓటుతో ఆమోదించగా.. లోక్ సభ దీనిని ఈ నెల 12 నే ఆమోదించింది. ప్రస్తుతం ఈ యూనివర్సిటీలు అనంతపురం, […]

పార్లమెంటులో ఏపీకి  వరాలు
Follow us on

ఏపీలో ఓ సెంట్రల్ యూనివర్సిటీని, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు మంగళవారం ఆమోదించింది. మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఈ మేరకు బిల్లును ప్రతిపాదించగా.. దీనికి ఆమోద ముద్ర లభించింది. వచ్ఛే నాలుగేళ్లలో వీటిని ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. సెంట్రల్ యూనివర్శిటీస్ (సవరణ) బిల్లు-2019 ని రాజ్యసభలో మూజువాణీ ఓటుతో ఆమోదించగా.. లోక్ సభ దీనిని ఈ నెల 12 నే ఆమోదించింది. ప్రస్తుతం ఈ యూనివర్సిటీలు అనంతపురం, విజయనగరంలలో తాత్కాలికంగా నడుస్తున్నాయి. సెంట్రల్ యూనివర్సిటీకి ప్రభుత్వం ఇదివరకే రూ. 450 కోట్లు, గిరిజన యూనివర్సిటీకి రూ. 420 కోట్లు కేటాయించింది. కాగా-నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ (సవరణ) బిల్లు-2019 ని హోమ్ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. లోక్ సభ ఈ బిల్లును ఈ నెల 15 న ఆమోదించిన సంగతి తెలిసిందే.. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 26 వరకు కొనసాగనున్నాయి. సమయం దగ్గర పడుతుండడంతో ముఖ్యమైన బిల్లులను పార్లమెంటు త్వరలో ఆమోదించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.