స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో.. ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ఈ వైరస్ ధాటికి పాకిస్తాన్ అల్లాడుతోంది. ఈ క్రమంలో అవినీతి కేసులో తనపై ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో పాకిస్థానీ వివాదాస్పద క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడు సంవత్సరాల పాటు అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిసిప్లినరీ ప్యానల్ ప్రకటించింది. వివరాల్లోకెళితే.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అతను స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు పీసీబీ అవినీతి […]

స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో.. ఉమర్ అక్మల్‌పై మూడేళ్ల నిషేధం..
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2020 | 7:03 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ఈ వైరస్ ధాటికి పాకిస్తాన్ అల్లాడుతోంది. ఈ క్రమంలో అవినీతి కేసులో తనపై ఉన్న ఆరోపణలు రుజువు కావడంతో పాకిస్థానీ వివాదాస్పద క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై మూడు సంవత్సరాల పాటు అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి నిషేధం విధిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిసిప్లినరీ ప్యానల్ ప్రకటించింది.

వివరాల్లోకెళితే.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అతను స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు పీసీబీ అవినీతి నిరోధక శాఖ రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. దీంతో అతన్ని పీసీబీ అవినీతి నిరోధక చట్టంలోని ఆర్టికల్ 2.4.4 ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అతన్ని క్రికెట్ నుంచి సస్పెండ్ చేశారు. మార్చి 31వ తేదీ లోపు అతను కోర్టులో విచారణకు హాజరుకావాల్సిందిగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

కాగా.. లాహోర్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ.. డిసిప్లినరీ ప్యానల్ జస్టీల్ ఫజల్-ఏ-మిరాన్ చౌహాన్ ఆధ్వర్యంలో జరిగగిన విచారణలో అతనిపై ఉన్న ఆరోపణలు నిజాలని రుజువు కావడంతో.. అతనికి మూడేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. షేర్జీల్ ఖాన్ తర్వాత అవినీతి కేసులో నిషేధం ఎదురుకుంటున్న రెండో క్రికెటర్‌గా ఉమర్ నిలిచాడు. 2017లో షేర్జీల్ ఖాన్‌పై ఐదు సంవత్సరాల పాటు నిషేధం పడింది.

[svt-event date=”27/04/2020,6:48PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Latest Articles
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
తెలంగాణలో 10 సీట్లు గెలుస్తాం.. ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జడేజా.. పంజాబ్‌పై చెన్నై ఘన విజయం
ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి తత్తరపాటు..! ఫ్యాంటు జేబులు చెక్ చేయగా
ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి తత్తరపాటు..! ఫ్యాంటు జేబులు చెక్ చేయగా
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్‌కతా.. ఇంపాక్ట్ ప్లేయర్లు వీరే
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్‌కతా.. ఇంపాక్ట్ ప్లేయర్లు వీరే
తెలంగాణకు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ
తెలంగాణకు వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ
చిన్నగా ఉందని చీప్‌గా చూడకండి.. ఐస్ క్యూబ్స్ వేస్తే క్షణాల్లో..!
చిన్నగా ఉందని చీప్‌గా చూడకండి.. ఐస్ క్యూబ్స్ వేస్తే క్షణాల్లో..!
దంతాలు ఊడిపోతున్నాయా.? మీకు ఆ సమస్య తప్పదు..
దంతాలు ఊడిపోతున్నాయా.? మీకు ఆ సమస్య తప్పదు..