అవినీతిని అరికట్టేందుకు సిద్దమవుతున్న పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్.. బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు కమిట్ అయ్యారు పవన్. అయితే పవన్ తో సినిమా చేయాలని..

అవినీతిని అరికట్టేందుకు సిద్దమవుతున్న పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్.. బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమా...

Updated on: Dec 27, 2020 | 7:25 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు కమిట్ అయ్యారు పవన్. అయితే పవన్ తో సినిమా చేయాలని టాప్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఎప్పటినుంచో చూస్తున్నారు. పవన్ కూడా బండ్ల తో సినిమాకు ఓకే చెప్పాడు. అయితే  పూరితో ఒక సినిమాను బండ్ల నిర్మాణంలో పవన్ చేస్తాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవన్ ఇటు సినిమాలతో అటు రాజకీయాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఎన్నికలకు ముందే వీలైనన్ని సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడు పవన్. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది.

ఈ సినిమా అవినీతి నిర్మాలనకు పోరాడే వ్యక్తి ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే స్టోరీ లైన్ సిద్దంగా ఉందని త్వరలోనే పూర్తి కథను సిద్దం చేసి వచ్చే ఏడాది చివరి వరకు పవన్ తో సినిమాను మొదలు పెట్టేందుకు పూరి సిద్దం అవుతున్నాడు అంటూ వార్తలు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో బద్రి, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలు వచ్చిన విషయం తెల్సిందే.  ఇక వకీల్ సాబ్ సినిమాజాతో పాటు అటు ‘అయ్యప్పనుమ్ కోషియం’ తెలుగు రీమేక్ ను పట్టాలెక్కించాడు పవర్ స్టార్. ఈ రెండు సినిమాలతో పాటు క్రిష్ సినిమాను కూడా పూర్తిచేయాలని చూస్తున్నాడు పవన్. ఆతర్వాత హరీష్ శంకర్ , సురేందర్ రెడ్డి లతో పవన్ సినిమాలు చేయాల్సి ఉంది.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us