తగ్గనున్న ఉల్లి ధరలు.. ఆప్ఘన్ నుంచి దిగుమతులు!

ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. విదేశాలనుంచి జోరుగా దిగుమతులకు అనుమతిచ్చింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం కూడా విధించడంతో.. ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. గత కొన్ని వారాలుగా అటారి సరిహద్దు మీదుగా ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉల్లిపాయ దిగుమతులు జరుగుతున్నాయి. దీంతో ధరల పెరుగుదలను అదుపు చేయడం సులభతరమవుతుంది. రాజస్థాన్‌లోని అల్వార్ సరిహద్దు మీదుగా ఈ సరుకులు రానున్నాయి. ఉత్తర భారతంలో కిలో ఉల్లిపాయల ధర 100-110 రూపాయలు పలుకుతోంది. అటారి చెక్ […]

తగ్గనున్న ఉల్లి ధరలు.. ఆప్ఘన్ నుంచి దిగుమతులు!
Follow us

| Edited By:

Updated on: Dec 12, 2019 | 11:31 PM

ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. విదేశాలనుంచి జోరుగా దిగుమతులకు అనుమతిచ్చింది. ఉల్లి ఎగుమతులపై నిషేధం కూడా విధించడంతో.. ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి.

గత కొన్ని వారాలుగా అటారి సరిహద్దు మీదుగా ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉల్లిపాయ దిగుమతులు జరుగుతున్నాయి. దీంతో ధరల పెరుగుదలను అదుపు చేయడం సులభతరమవుతుంది. రాజస్థాన్‌లోని అల్వార్ సరిహద్దు మీదుగా ఈ సరుకులు రానున్నాయి. ఉత్తర భారతంలో కిలో ఉల్లిపాయల ధర 100-110 రూపాయలు పలుకుతోంది. అటారి చెక్ పోస్ట్ మీదుగా ఉల్లిపాయలతో నిండిన 50 ట్రక్కులు భారతదేశానికి చేరుకున్నాయి. మరో 55 ట్రక్కులు రానున్నాయి. ప్రస్తుతం దిగుమతుల్లో ఉల్లిపాయ అగ్రస్థానంలో ఉంది. అని అటారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ మేనేజర్ సుఖ్ దేవ్ సింగ్ తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దులో సుమారు 1500-2000 టన్నుల ఉల్లిపాయ దిగుమతి అవుతోంది. అంతర్జాతీయ సరఫరాలో ఉల్లిపాయ టోకు ధరలు 20-30% తగ్గాయని వ్యాపారులు తెలిపారు.