Vastu Tips: మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..

ఉప్పు ఇలా మనం సంప్రదాయం, నమ్మకాల్లో కూడా ఒక భాగమైపోయింది. ఉప్పు నెగిటివ్‌ ఎనర్జీ తొలగిస్తుందని విశ్వసిస్తుంటారు. అందుకే కొన్ని రకాల వాస్తు దోషాలకు కూడా ఉప్పు మంచి రెమెడిగా ఉపయోగపడుతుంది. ఇంటిని ఎంత వాస్తుకు అనుగుణంగా నిర్మించినా మనకు తెలిసో తెలియకో కొన్ని వాస్తు దోషాలు అలాగే ఉండిపోతాయి. వీటివల్ల ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి...

Vastu Tips: మీ ఇంట్లో ఉప్పు ఉందా.? ఇలా చేస్తే వాస్తు దోషాలన్నీ పరార్‌..
Vastu Tips
Follow us

|

Updated on: May 05, 2024 | 4:46 PM

ఉప్పు ప్రతీ ఇంటిలో కచ్చితంగా ఉండే వస్తువు. ఉప్పులేని వంటగది ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు. వంటలో అన్ని రకాల పదార్థాలు వేసి ఒక్క ఉప్పు వేయకపోతే చాలు ఆ వంటకానికి రుచే ఉండదు. అందుకే అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అనే సామెత పుట్టుకొచ్చింది. ఇక ఉప్పు కేవలం వంటకాలకు మాత్రమే పరిమితం కాకుండా. మన నమ్మకాలతో కూడా ముడిపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో చిన్నారులు కాస్త ఏడిస్తే చాలు వెంటనే ఉప్పుతో దిష్టి తీసేయమని పెద్దలు చెబుతుంటారు.

ఉప్పు ఇలా మనం సంప్రదాయం, నమ్మకాల్లో కూడా ఒక భాగమైపోయింది. ఉప్పు నెగిటివ్‌ ఎనర్జీ తొలగిస్తుందని విశ్వసిస్తుంటారు. అందుకే కొన్ని రకాల వాస్తు దోషాలకు కూడా ఉప్పు మంచి రెమెడిగా ఉపయోగపడుతుంది. ఇంటిని ఎంత వాస్తుకు అనుగుణంగా నిర్మించినా మనకు తెలిసో తెలియకో కొన్ని వాస్తు దోషాలు అలాగే ఉండిపోతాయి. వీటివల్ల ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఉప్పుతో ఇలాంటి వాస్తు దోషాలకు ఫుల్ స్టాప్‌ పెట్టొచ్చని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ విధానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుందని పండితులు చెబుతున్నారు. ఒక వస్త్రంలో కాస్త ఉప్పును కట్టి ఇంటి గుమ్మానికి కడితే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా తగ్గిపోతాయని అంటున్నారు. ఇక వారం ఒకసారి ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీళ్లలో కాస్త రాళ్లుప్పును వేసి కడగాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్‌ ఎనర్జీ పోతుందని విశ్వాసం.

ఇక ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో నీరుపోయాలి. అనంతరం ఆ నీటిలో కాస్త ఉప్పు వేసి ఇంట్లోని మూలల్లో పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోయి కుటుంబ సభ్యుల మధ్య సక్యత నెలకొంటుంది. ఈ ఉప్పును ప్రతీ వారం మారుస్తూ ఉండాలి. ఇంట్లో ప్రశాంతంగా లేకున్నా, ఆర్థిక సమస్యలు వేధిస్తున్నా.. ఒక గాజు గిన్నె తీసుకొని అందులో రాళ్ల ఉప్పు, 4-5 లవంగాలు వేసి ఇంట్లో మూలలో ఉండాలి. ఇలా చేస్తే మార్పు మీరే గమనిస్తారు.

నోట్‌: ఇందులో తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Latest Articles
చేపల ఫ్రై చేస్తుండగా అనూహ్య ఘటన.. కస్టమర్లు పరుగో పరుగు..
చేపల ఫ్రై చేస్తుండగా అనూహ్య ఘటన.. కస్టమర్లు పరుగో పరుగు..
ఆ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు పక్కా..!
ఆ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు పక్కా..!
ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. టమాటోతో ఐస్‌క్రీమ్ రోల్..
ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. టమాటోతో ఐస్‌క్రీమ్ రోల్..
భారత్‌లో త్వరలో ఎయిర్ టాక్సీ సేవలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
భారత్‌లో త్వరలో ఎయిర్ టాక్సీ సేవలు.. ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా?
కారు బీమాతో ఆర్థిక ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ తప్పలు వద్దంతే.!
కారు బీమాతో ఆర్థిక ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ తప్పలు వద్దంతే.!
మతం మంటల్లో దేశరాజకీయం ఉడుకుతోందా?
మతం మంటల్లో దేశరాజకీయం ఉడుకుతోందా?
చెన్నైతో హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్లు ఇవే
చెన్నైతో హై ఓల్టేజ్ మ్యాచ్.. టాస్ ఓడిన ఆర్సీబీ.. తుది జట్లు ఇవే
ఇసుక తవ్వుతుండగా ఏం బయటపడిందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు
ఇసుక తవ్వుతుండగా ఏం బయటపడిందో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?
సీనియర్ సిటిజన్లు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదా..?
వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే
వేసవిలో ఎన్ని గుడ్లు తినవచ్చో తెలుసా నిపుణులు ఏమి చెబుతున్నారంటే