పక్షికి తోకలేంటని ఆశ్చర్యపోతున్నారా..? అవును నిజమే తెలుపు, నీలిరంగు రంగులో ఉండే ఈ పక్షికి రెండు తోకలు ఉన్నాయి. అవి దాదాపు 19-22 సెంటీమీటర్ల పొడువుతో, తెలుపు రంగులో ఉంటాయి. మరి ఈ పక్షి పేరేంటని ఆలోచిస్తున్నారా..? ఆయాసపడకండి.. ఈ పక్షి పేరు ఇండియన్ ప్యారడైజ్ ఫ్లెక్యాచర్. దీనికి నెమలికి ఉన్నట్లు చిన్న పింఛం కూడా ఉంటుంది. రెక్కలు నీలిరంగులో ఉంటాయి. ఇది చాలా అరుదుగా కనిపించే పక్షి. ఈ పక్షి మంచిర్యాల అడవిలో ఓ చెరువుపై ఎగురుతూ ఉండగా కెమెరాకి చిక్కింది. ఈ రకం జాతికి చెందిన పక్షులు చెట్ల కింద సంచరిస్తూ చిన్న చిన్న పురుగుల్ని పట్టుకుని తింటూంటాయి. ఇది చాలా అరుదు జాతి కావడంతో అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఈ పక్షిని చేర్చింది ‘అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమాఖ్య’.