Central Government Order: జనవరి 30న దేశమంతటా ఆ రెండు నిమిషాలు మౌనం పాటించాలి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

Central Government Order:  అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 30న దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉదయం 11 గంటలకు రెండు నిమిషాల పాటు మౌనం..

Central Government Order: జనవరి 30న దేశమంతటా ఆ రెండు నిమిషాలు మౌనం పాటించాలి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
Follow us

|

Updated on: Jan 30, 2021 | 5:52 AM

Central Government Order: అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 30న దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉదయం 11 గంటలకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి యేటా కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇది కొన్ని కార్యాలయాలకే పరిమితం అవుతూ వస్తోందని, సాధారణ ప్రజలు రోజువారీ పనుల్లో నిగమ్నమవుతూ దీనిని విస్మరిస్తున్నారని హోంశాఖ అభిప్రాయపడింది. ఈ ఏడాది దేశ ప్రజలందరినీ మమేకం చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

కాగా, 30న ఉదయం 11 గంటల నుంచి రెండు నిమిషాల పాటు అన్ని రకాల సేవలు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. ఎక్కడ వీలైతే అక్కడ మౌనం పాటించాలని తెలిపింది. మౌనం ప్రారంభించే ముందు, ముగింపు సమయాల్లో సైరన్లు, సైనిక తుపాకుల శబ్దం వినిపించాలని సూచించింది. ఒక వేళ సైరన్లు, తుపాకుల శబ్దాలు అందుబాటులో లేకపోయినా మౌనం పాటించాలన్నారు.

Also Read: Amit Shah Tour Cancels: ఢిల్లీ పేలుడుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్‌ పర్యటన రద్దు