లైట్లు ఆర్పితే గ్రిడ్ పోతుందా? అలా అన్నోడు ఇంజనీరే కాదు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లు ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్ళలోని లైట్లన్నీ ఆర్పేస్తే విద్యుత్ గ్రిడ్ దెబ్బతింటుందన్న ప్రచారంలో వాస్తవం లేదంటున్నారు విద్యుత్ శాఖాధికారులు.

లైట్లు ఆర్పితే గ్రిడ్ పోతుందా? అలా అన్నోడు ఇంజనీరే కాదు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 04, 2020 | 3:49 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లు ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇళ్ళలోని లైట్లన్నీ ఆర్పేస్తే విద్యుత్ గ్రిడ్ దెబ్బతింటుందన్న ప్రచారంలో వాస్తవం లేదంటున్నారు విద్యుత్ శాఖాధికారులు. ఒక్కసారిగా లోడ్ పడిపోతే గ్రిడ్ దెబ్బతింటున్న కథనాల్లో వాస్తవం లేదని చెబుతున్నారు. గతంలో చాలా సార్లు విద్యుత్ లోడు 20-30 శాతానికి పడిపోయినా గ్రిడ్‌లకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని, ఇప్పుడు కూడా లైట్లు ఆర్పితే ఏమీ కాదంటున్నారు.

ఒకవైపు కరోనా వ్యాప్తి నిరోధానికి యుద్దం, మరోవైపు లాక్ డౌన్.. ఇలా దేశమంతా ఒక్కతాటిపైనే వుందని చాటేందుకు సంకల్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఏప్రిల్ 5వ తేదీన రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లు అన్నీ ఆర్పేసి.. దీపాలు, కొవ్వొత్తులు లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లు గానీ వెలిగించాలని పిలుపునిచ్చారు. దీపాలను వెలిగించడం సరికొత్త నవోదయానికి నాందీగా భావించే హిందూ దేశంలో.. ప్రధాన మంత్రి పిలుపు వెనుక సనాతన హిందూ ఆచారం దాగి వుందని గుర్తించని కొందరు మోదీ పిలుపును తప్పు పడుతున్నారు.

సహజంగానే మోదీని నిత్యం వ్యతిరేకించే అసదుద్దీన్ ఓవైసీ, కమల్ హాసన్ వంటి వారు ఈ దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని నిందిస్తున్నారు. మరికొందరు ఫేక్ ఇంజీనీర్లుగా మారి ఒకేసారి పెద్ద ఎత్తున విద్యుత్ లైట్లను ఆర్పేస్తే లోడ్ ఒక్కసారిగా పడిపోయి.. విద్యుత్ గ్రిడ్లు దెబ్బతింటాయని ప్రచారం చేస్తున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ జెన్‌కో సీఎండి ప్రభాకర్ రావు స్పందించారు. లోడు తగ్గితే.. గ్రిడ్ దెబ్బతింటుందని, కుప్పకూలుతుందని ప్రచారంచేసే వారు అసలు ఇంజినీర్లే కాదని ఆయనంటున్నారు.

ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు ఆపివేయడం వల్ల పవర్ గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం పడదని ఆయన చెబుతున్నారు. గతంలో విద్యుత్ లోడు ఒక్కసారిగా 20-30 శాతానికి పడిపోయిన సందర్భాలున్నాయని అప్పడు కూడా గ్రిడ్లకు ఏమీ కాలేదని ప్రభాకర్ రావు చెబుతున్నారు. అయినప్పటికీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ గ్రిడ్‌కు ఎలాంటి సమస్య రాకుండా అప్రమత్తంగా ఉన్నామని ఆయన చెప్పారు.

లైట్లు ఆపివేస్తే గ్రిడ్ కుప్పకూలుతుంది అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తెలంగాణ పవర్ గ్రిడ్ సురక్షితంగా ఉందని, మా ఇంజనీర్స్ అందరూ వారి జాగ్రత్తలో వారు ఉన్నారని ఇప్పటికే జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశామని ప్రభాకర్ రావు తెలిపారు. సోషల్ మీడియాలో ఇంజినీర్ల పేరిట వస్తున్న వార్తలను ఖండించారాయన.

Latest Articles
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..