నిర్భయ దోషి వినయ్ శర్మకు స్లో పాయిజన్ ఇస్తున్నారట.. నిజమా?

నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మకు మెల్లగా పాయిజన్ (విషం) ఎక్కిస్తున్నారని అతని తరఫు లాయర్ ఏ.పీ. సింగ్ షాకింగ్ వార్తను తెలిపారు. తన క్లయింటును ఆసుపత్రిలో చేర్పించారని ఆయన ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు వెల్లడించారు. పైగా వినయ్ శర్మకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా అందజేయడంలేదన్నారు.  శనివారం ఆయన ఈ మేరకు కోర్టుకు ఓ దరఖాస్తును దాఖలు చేశారు. ఈ కేసులో దోషులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను తీహార్ జైలు అధికారులు తొక్కి పెడుతూ..వారు […]

నిర్భయ దోషి వినయ్ శర్మకు స్లో పాయిజన్ ఇస్తున్నారట.. నిజమా?
Follow us

| Edited By: Srinu

Updated on: Jan 25, 2020 | 8:00 PM

నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మకు మెల్లగా పాయిజన్ (విషం) ఎక్కిస్తున్నారని అతని తరఫు లాయర్ ఏ.పీ. సింగ్ షాకింగ్ వార్తను తెలిపారు. తన క్లయింటును ఆసుపత్రిలో చేర్పించారని ఆయన ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు వెల్లడించారు. పైగా వినయ్ శర్మకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా అందజేయడంలేదన్నారు.  శనివారం ఆయన ఈ మేరకు కోర్టుకు ఓ దరఖాస్తును దాఖలు చేశారు.

ఈ కేసులో దోషులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను తీహార్ జైలు అధికారులు తొక్కి పెడుతూ..వారు క్షమాభిక్ష పిటిషన్లను దాఖలు చేయకుండా చూసేలా జాప్యం చేస్తున్నారని సింగ్ ఆరోపించారు. తన క్లయింటు మెర్సీ పిటిషన్ దాఖలు చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్లను అధికారులు ఇంకా ఇవ్వలేదని కూడా ఆయన పేర్కొన్నారు. అలాగే అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ల దాఖలుకు కూడా వారు అడ్డుపడుతున్నారని అన్నారు. అయితే పోలీసుల తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం దోషులు కావాలనే లీగల్ ప్రాసెస్ జాప్యమయ్యేలా ఎత్తుగడలకు పాల్పడుతున్నారని అదనపు సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ జైన్ కు తెలిపారు.  నిర్భయ దోషులు నలుగురిని ఫిబ్రవరి 1 న ఉరి తీయనున్నారు.

‘తదుపరి ఆదేశాలు అవసరం లేదు’

ఇలా ఉండగా.. తన క్లయింటు క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలను జైలు అధికారులు రిలీజ్ చేయడం లేదన్న వినయ్ శర్మ తరఫు అడ్వొకేట్ సింగ్ వాదనను ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు దాదాపు తోసిపుచ్చింది. తాము కోరిన అన్ని డాక్యుమెంట్లను అధికారులు సమర్పించారని, అందువల్ల తదుపరి ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. అయితే వినయ్ కి చెందిన 160 పేజీల డైరీ కోసం  తాను హైకోర్టులో అప్పీలు దాఖలు చేస్తానని సింగ్ చెప్పారు. ఈ డైరీ కావాలని నేను ఈ నెల 22 నే జైలు అధికారులను కోరినా ఇంకా ఇవ్వలేదన్నారు. మెర్సీ పిటిషన్ దాఖలు చేయడానికి ఈ డైరీ ఎంతో అవసరమన్నారు. స్లో పాయిజన్ కారణంగా అస్వస్థుడైన తన క్లయింటును మొదట జైలు  ఆసుపత్రికి, ఆ తరువాత దీన్  దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి, అనంతరం లోక్ నాయక్ జయప్రకాశ్ హాస్పిటల్ కు  తరలించారని సింగ్ పేర్కొన్నారు. వినయ్ ఆహారం తినడంలేదని, అతని చెయ్యి విరిగిందని అన్నారు. జైలు ఆసుపత్రిలో అతని చికిత్సకు సంబంధించిన ఆధారాలను అవసరమైతే చూపుతానని సింగ్ చెప్పారు. అతని మెర్సీ పిటిషన్ ను పరిశీలించేటప్పుడు రాష్ట్రపతి ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..