కరోనా ఎఫెక్ట్: మాస్కులు ధరించకుంటే.. జైలే గతి..

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ పంజా విసురుతోంది. కొనసాగుతున్న కరోనావైరస్ వ్యాప్తిలో హాట్‌స్పాట్‌గా అవతరించిన నగరంలో మాస్కులు ధరించడం

కరోనా ఎఫెక్ట్: మాస్కులు ధరించకుంటే.. జైలే గతి..
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2020 | 4:17 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ పంజా విసురుతోంది. కొనసాగుతున్న కరోనావైరస్ వ్యాప్తిలో హాట్‌స్పాట్‌గా అవతరించిన నగరంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అని ముంబై మునిసిపల్ అధికారులు ప్రకటించారు. ఉల్లంఘించినవారిని తక్షణమే అరెస్టు చేయవచ్చని ఒక ఉత్తర్వులో తెలిపారు. 2 కోట్లకు పైగా జనాభాతో, ముంబైలో 782 కరోనా పాజిటివ్ కేసులు, 50 మరణాలు నమోదయ్యాయని తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ పేర్కొంది. దేశంలోనే అత్యధికంగా కరోనావైరస్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. నగరంలో కరోనావైరస్ కేసుల వ్యాప్తిని నివారించడానికి, పరీక్షలను విస్తరించడానికి అధికారులు పోటీ పడుతున్నందున దేశ ఆర్థిక కేంద్రంలో కనీసం ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ చర్యలను విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.