లాక్‌డౌన్ ఎఫెక్ట్: ముంబై నుంచి 3,700 మంది విదేశీయుల తరలింపు..

| Edited By:

Apr 16, 2020 | 3:38 PM

కోవిద్-19 కట్టడికోసం లాక్‌డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబై నగరంలో చిక్కుకుపోయిన వివిధ దేశాలకు చెందిన 3,700మంది ప్రయాణికులను వారి దేశాలకు తరలించారు. లాక్‌డౌన్ అమలులోకి వచ్చాక

లాక్‌డౌన్ ఎఫెక్ట్: ముంబై నుంచి 3,700 మంది విదేశీయుల తరలింపు..
Follow us on

కోవిద్-19 కట్టడికోసం లాక్‌డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబై నగరంలో చిక్కుకుపోయిన వివిధ దేశాలకు చెందిన 3,700మంది ప్రయాణికులను వారి దేశాలకు తరలించారు. లాక్‌డౌన్ అమలులోకి వచ్చాక పలు దేశాలకు చెందిన 3,700 మందిని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్, అట్లాంటా, ఫ్రాంక్ ఫర్ట్, సింగపూర్, పారిస్, టోక్యో నగరాలకు ప్రత్యేక విమానాల్లో తరలించామని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

కాగా.. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14వతేదీ వరకు 20 ప్రత్యేక విమానాల్లో విదేశీయులను తరలించామని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. వివిధ దేశాలకు 240 కార్గో విమానాల్లో ఎగుమతులు, దిగుమతులు చేశామని అధికారులు వివరించారు. కరోనా ప్రబలకుండా విమానాశ్రయంతోపాటు విమానాలను శానిటైజ్ చేసి అన్ని రకాల ముందు జాగ్రత్తలతో విదేశీయులను వారి దేశాలకు తరలించామని అధికారులు పేర్కొన్నారు.

Also Read: లాక్‌డౌన్ పాటించకపోతే.. వాహనాలు సీజ్..