మున్సిపాలిటీలో పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత: కేటీఆర్

వికారాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీలపై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్షించారు.

మున్సిపాలిటీలో పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత: కేటీఆర్
Follow us

|

Updated on: Jun 15, 2020 | 7:32 PM

ప్రతి మున్సిపాలిటీలో పచ్చదనంతో పాటు పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు మంత్రి కేటీ రామారావు. వికారాబాద్‌ జిల్లాలోని మున్సిపాలిటీలపై తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం సమీక్షించారు. ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ వివిధ మున్సిపాలిటీ కమిషనర్లు హాజరయ్యారు. గతవారం కోస్గి, కొడంగల్‌ మున్సిపాలిటీపైన చర్చించిన కేటీఆర్‌.. సోమవారం వికారాబాద్‌, తాండూర్‌, పరిగి మున్సిపాలిటీలపై సుదీర్ఘరంగా చర్చించారు. ఆయా పట్టణాల ఆదాయ వనరులు, ఖర్చు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ఈ మూడు మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్లను కేటీఆర్‌ ఆదేశించారు.. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు కేటీఆర్‌. వికారాబాద్‌, తాండూర్‌, పరిగి పట్టణాల్లో పార్కులు, ఫుట్‌పాత్‌లు, రోడ్లు, టాయిలెట్ల నిర్మాణం, స్మశాన వాటికల నిర్మాణ పనులకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ పలు సూచనలు చేశారు.