అడవిలో ప్రేమ జంట ఆత్మహత్య

ఒకరిపైనొకరు మనసు పడ్డారు. పరిచయం నుంచి మొదలై ప్రేమ వరకు వెళ్లింది. ఇద్దరి హృదయాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కాలకాలం కలిసుంటామని బాసలు చేసుకున్నారు. అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో పావులయ్యారు. కలిసి కాపురం చేయలేక విడివిడిగా ఉండలేక ఆ జంట మరణంతో ఒక్కటయ్యారు. పెద్దలు పెళ్లికి అంగీకరించరేమోనని, ఆత్మహత్యే శరణ్యమనుకొని ప్రాణాలు తీసుకున్నారు. రెండు కుటుంబాల్లో ఈ ఘటన తీరని ఆవేదనను మిగిల్చింది.

అడవిలో ప్రేమ జంట ఆత్మహత్య

Updated on: Aug 06, 2020 | 5:12 PM

ఒకరిపైనొకరు మనసు పడ్డారు. పరిచయం నుంచి మొదలై ప్రేమ వరకు వెళ్లింది. ఇద్దరి హృదయాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కాలకాలం కలిసుంటామని బాసలు చేసుకున్నారు. అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో పావులయ్యారు. కలిసి కాపురం చేయలేక విడివిడిగా ఉండలేక ఆ జంట మరణంతో ఒక్కటయ్యారు. పెద్దలు పెళ్లికి అంగీకరించరేమోనని, ఆత్మహత్యే శరణ్యమనుకొని ప్రాణాలు తీసుకున్నారు. రెండు కుటుంబాల్లో ఈ ఘటన తీరని ఆవేదనను మిగిల్చింది.

కుమురం భీం అసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌ మండలంలోని మామిడిపల్లి, పిక్లాతండా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనస్థలానికి చేరుకున్న జైసూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మామిడిపల్లి గ్రామానికి చెందిన మడావి సుర్యారావుకు ఏడుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. విజయలక్ష్మి(20) అయిదో సంతానం. ఏడాది కిందటే ఆమె తండ్రి చనిపోయాడు. ఆమె తన అక్క ఊరైన జైనూర్‌ మండలంలోని రాశిమెట్టకు తరుచు వెళ్లేది. ఇదే క్రమంలో రాశిమెట్టకు చెందిన ఆత్రం సీతారాం కుమారుడు భీంరావ్‌(22)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఏడాదిగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇదిలావుంటే, మంగళవారం సాయంత్రం విజయలక్ష్మి ఆసుపత్రికి వెళ్తానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. అంతలోనే బుధవారం సాయంత్రం పిక్లాతండా సమీపంలో ఆ జంట పురుగుల మందు తాగారు. అటవీ ప్రాంతంలో అపస్మరకస్థితిలో పడి ఉన్న ఆ ఇద్దరిని చూసిన పశువుల కాపరి విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. దీంతో స్థానికులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే విజయలక్ష్మీ మరణించింది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భీంరావును పోలీసులు ఆసుపత్రికి తరలించే క్రమంలో ప్రాణాలొదిలాడు. పెళ్లికి రెండు కుటుంబాలు ఒప్పుకుంటాయో లేదోననే మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జైసూర్ సీఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us