ఇక ‘వేట’ మొదలు, రైతు నేతల కోసం లుక్ ఔట్ నోటీసులు, ఎఫ్ ఐ ఆర్ లో నటుడు దీప్ సిద్దు పేరు

ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద ఈ నెల 26 న జరిగిన ఘటనలకు సంబంధించి 20 మందికి పైగా రైతు నేతలకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలని హోం శాఖ ఢిల్లీ పోలీసులను..

ఇక 'వేట' మొదలు, రైతు నేతల కోసం లుక్ ఔట్ నోటీసులు, ఎఫ్ ఐ ఆర్ లో నటుడు దీప్ సిద్దు పేరు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 28, 2021 | 12:42 PM

ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద ఈ నెల 26 న జరిగిన ఘటనలకు సంబంధించి 20 మందికి పైగా రైతు నేతలకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయాలని హోం శాఖ ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. వీరి పాస్ పోర్టులను స్వాధీనం చేసుకోవాలని సూచించింది. పంజాబీ నటుడు దీప్ సిద్దు, సోషల్ యాక్టివిస్ట్ గా మారిన గ్యాంగ్ స్టర్ లఖా సిధానా పేర్లని ఎఫ్ ఐ ఆర్ లో చేర్చారు. ఈ ఘటనలు జరిగిన నాటి  నుంచి ముఖ్యంగా దీప్ సిద్దు జాడ కనబడడంలేదు. ఎర్రకోట వద్ద అల్లర్లను ఈయన, లఖా  సిధానా ప్రేరేపించారని ఈ ప్రథమ నివేదికల్లో ఆరోపించారు. మొత్తం 22 ఎఫ్ ఐ ఆర్ లు దాఖలు కాగా 37 మంది రైత్జులను అల్లర్లకు బాధ్యులుగా పేర్కొన్నారు. కాగా.. ఎర్రకోట వద్ద జరిగిన ఘటనల్లో ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందో ఆర్కియలాజికల్ సర్వే సంస్థ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.