ఏపీలోని ఈ ప్రాంతంలో.. జూన్ 8వరకు లాక్‌డౌన్ పొడిగింపు..

Lockdown in Nuziveedu: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. కృష్ణాజిల్లా నూజివీడులో లాక్‌డౌన్‌ను జూన్ 8వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు తహసీల్దార్ ఎం.సురేశ్‌కుమార్ తెలిపారు. స్థానిక మైలవరం రోడ్డుకు చెందిన ఓ మహిళకు నూజివీడు ఆసుపత్రిలో నిర్వహించిన ట్రూనాట్ కోవిద్-19 పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో మరిన్ని శాంపిల్స్ సేకరించి విజయవాడ పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం […]

ఏపీలోని ఈ ప్రాంతంలో.. జూన్ 8వరకు లాక్‌డౌన్ పొడిగింపు..
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 10:52 AM

Lockdown in Nuziveedu: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీంతో చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయితే.. కృష్ణాజిల్లా నూజివీడులో లాక్‌డౌన్‌ను జూన్ 8వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు తహసీల్దార్ ఎం.సురేశ్‌కుమార్ తెలిపారు. స్థానిక మైలవరం రోడ్డుకు చెందిన ఓ మహిళకు నూజివీడు ఆసుపత్రిలో నిర్వహించిన ట్రూనాట్ కోవిద్-19 పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో మరిన్ని శాంపిల్స్ సేకరించి విజయవాడ పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు.. పట్టణంలోని రెడ్‌ జోన్ ప్రాంతాల్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే కూరగాయలు, నిత్యావసర దుకాణాలు తెరవాలని తహసీల్దార్ ఎం.సురేశ్‌కుమార్ ఆదేశించారు. కాగా.. కృష్ణలంక భ్రమరాంబపురంలోని సతీశ్ కుమార్ రోడ్డులో సోమవారం ఒక కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో పారిశుద్ధ్య సిబ్బంది భ్రమరాంబపురం, 21వ డివిజన్ల పరిధిలోని వీధుల్లో ఫాల్కన్‌ యంత్రంతో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.