3 రాజధానులకు బాబు బ్రేక్.. జగన్ ముందరి కాళ్ళకు బంధం

మూడు రాజధానుల ప్రతిపదన అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన ఏపీవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. అమరావతి ప్రాంతంలోని కొన్ని మండలాల్లో తప్పించి జగన్ ప్రకటనపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. నిజం చెప్పాలంటే అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కర్నూలులో అయితే తమ నగరానికి హైకోర్టు వస్తుందన్న ఆనందంతో ముఖ్యమంత్రి జగన్‌కు పాలాభిషేకాలు.. వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ […]

3 రాజధానులకు బాబు బ్రేక్.. జగన్ ముందరి కాళ్ళకు బంధం
Follow us

|

Updated on: Dec 20, 2019 | 2:45 PM

మూడు రాజధానుల ప్రతిపదన అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన ఏపీవ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. అమరావతి ప్రాంతంలోని కొన్ని మండలాల్లో తప్పించి జగన్ ప్రకటనపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. నిజం చెప్పాలంటే అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమల్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కర్నూలులో అయితే తమ నగరానికి హైకోర్టు వస్తుందన్న ఆనందంతో ముఖ్యమంత్రి జగన్‌కు పాలాభిషేకాలు.. వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ల దిష్టిబొమ్మల దగ్ధం వంటి కార్యక్రమాలు చేపట్టారు.

మూడు రాజధానుల ప్రతిపాదనకు ప్రజల్లో పెద్ద ఎత్తున సానుకూలత వ్యక్తం అవుతుండడంతో ఈ ప్రతిపాదనను అడ్డుకునేందుకు విపక్షాలు రైతులతో ఆందోళన కార్యక్రమాలు ప్లాన్ చేశాయి.. అయితే ఈ ఆందోళన కార్యక్రమాలు కేవలం మందడం, వెలగపూడి, ఉద్దండరాయుని పాలెం వంటి నాలుగైదు ప్రాంతాలకే పరిమితం కావడంతో దాని ఇంపాక్ట్ ప్రభుత్వంపై పెద్దగా వుండే ఛాన్స్ లేదు. దాంతో విపక్ష తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేందుకు కొత్త వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

రాజధానిపై నియమించిన కమిటీలు ఇవాళో రేపో నివేదికలిచ్చే పరిస్థితి వున్న నేపథ్యంలో కీలకమైన పాయింట్ ఆధారంగా న్యాయపోరాటానికి దిగేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహం రచిస్తోంది. గతంలో వేసిన కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, తాజాగా మళ్ళీ కమిటీలు వేయడం.. నిర్ణయాలు తీసుకోవడం న్యాయబద్దం కాదని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ఈ పాయింట్ మీదనే మూడు రాజధానుల ప్రతిపాదనను అడ్డుకునేందుకు న్యాయపోరాటానికి దిగాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తుందని సమాచారం. సో.. తెలుగుదేశం పార్టీ ఎత్తుగడ ఏ మేరకు ఫలితాలిస్తుందో వేచి చూడాలి.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..