ఖమ్మం జిల్లాలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. కరోనా నుంచి కోలుకున్న ఓ కోడలిని అత్తా మామలు ఇంట్లోకి రానీయకుండా బయటికి గెంటేసిన సంఘటన మధిర పట్టణంలో చోటు చేసుకుంది. దీంతో అత్తవారింటి ముందు కోడలు మౌనదీక్షకు దిగింది.
మధిర పట్టణంలో ఆర్ఎంపీ వైద్యుడు మస్తాన్ కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో చింతకాని మండలం కోదుమూరులో ఉన్న పుట్టింటికి వెళ్లింది. హోంక్వారంటైన్ ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవడంతో కరోనా నుంచి కోలుకుంది. తిరిగి అత్తగారింటికి వస్తే ఇంట్లోకి రానివ్వకుండా ఇంటికి తాళం వేసుకొని బయటికి గెంటేశారు.
అత్తవారింటికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఆమెకు తన ఇంట్లోకి రావడానికి వీలు లేదంటూ అత్త మామ గేట్ కి తాళం వేసి బయటకు వెళ్లి పోయారు. కోడలు ఎంత ప్రాదేయపడ్డా ఫలితం లేకపోవడంతో అత్త ఇంటి ముందు కోడలు మౌనదీక్ష చేపట్టింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడే ఉండి పోరాడుతానని బాధితురాలు తెలిపింది.