మాజీ తహసీల్దార్‌ నాగరాజు చివరి వీడియో కాల్.. ఏం చెప్పారంటే.!

ఆత్మహత్యకు పాల్పడ్డ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు చివరి వీడియో కాల్‌లో వెలుగులోకి వచ్చింది. చనిపోడానికి ముందు నాగరాజు చివరిసారి కుటుబంతో వీడియో కాల్ మాట్లాడారు.

మాజీ తహసీల్దార్‌ నాగరాజు చివరి వీడియో కాల్.. ఏం చెప్పారంటే.!
Follow us

|

Updated on: Oct 17, 2020 | 5:25 PM

Keesara Ex Tahsildar Nagaraju: ఆత్మహత్యకు పాల్పడ్డ కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు చివరి వీడియో కాల్‌లో వెలుగులోకి వచ్చింది. చనిపోడానికి ముందు నాగరాజు చివరిసారి కుటుబంతో వీడియో కాల్ మాట్లాడారు. రెండో కేసులో ఏసీబీ కస్టడీ తీసుకోవడానికి ముందు.. కేసు విషయంలో సంభాషణ జరిపారు. ”తాను ఏ తప్పు చేయలేదు. రికార్డ్స్ పరిశీలించే ముందకెళ్లాను. ఈ విషయాన్ని న్యాయవాదికి చెప్పి కోర్టులో తెలపాలని” నాగరాజు ఆ వీడియో కాల్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌కు చెప్పారు. బెయిల్‌పై బయటకు వచ్చాక కోర్టులో చూద్దాం అంటూ కుటుంబ సభ్యులు నాగరాజుతో అన్నారు.

అవినీతి ఆరోపణల కేసులో కీసర మాజీ తహసీల్దార్‌ను ఏసీబీ అరెస్ట్‌ చేయగా.. చంచలగూడ జైలులో ఉరి వేసుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. కోటి 10 లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజును ఏసీబీ నెలరోజులుగా విచారిస్తోంది. నకిలీ పాసు పుస్తకాల జారీ విషయంలోనూ నాగరాజు బుక్కయ్యారు. దర్యాప్తులో భాగంగా ఏసీబీ ఆయనను లోతుగా ప్రశ్నించింది. అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. దాటివేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం.