Jayaprakash Reddy’s Funeral Ended : టాలీవుడ్ విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. గుంటూరు జిల్లా కొరిటెపాడు స్మశానవాటికలో ఆయన అంతిమసంస్కరాలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. సోమవారం రాత్రి గుండెపోటుతో జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు.
ఆయన మరణించారని తెలుసుకున్న టాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పలువురు రాజకీయ ప్రముఖులు భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మరికొందరు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సంతాపం తెలిపారు.
కాగా.. దశాబ్దాలపాటు తన విలక్షణ నటనతో జయప్రకాష్ రెడ్డి తెలుగు ప్రేక్షకులను అలరించారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఫ్యాక్షనిస్ట్‌గా.. ఇలా పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి మెప్పించారు. జయప్రకాష్ అకాల మరణం తీరని లోటు అని పలువురు సినీ ప్రముఖులు కొనియాడారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి వెంకయ్య, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం సోషల్ మీడియా వేదికగా జయప్రకాష్ మృతిపై ట్వీట్స్ చేశారు.