భారత్​, చైనాల మధ్య వివాదంపై ట్రంప్ కామెంట్స్…

సరిహద్దు విషయంలో భారత్​-చైనా మధ్య సంక్లిష్ట ప‌రిస్థితులు త‌లెత్తాయ‌ని తెలిపారు అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఇది చాలా పెద్ద స‌మ‌స్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు.

భారత్​, చైనాల మధ్య వివాదంపై ట్రంప్ కామెంట్స్...
Ram Naramaneni

|

Jun 21, 2020 | 9:46 AM

సరిహద్దు విషయంలో భారత్​-చైనా మధ్య సంక్లిష్ట ప‌రిస్థితులు త‌లెత్తాయ‌ని తెలిపారు అగ్ర‌రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. ఇది చాలా పెద్ద స‌మ‌స్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఇరు దేశాలకు సాయం చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓక్లహోమాలోని తుల్సాలో త‌ల‌పెట్టిన‌ ఎల‌క్ష‌న్ ర్యాలీకి వెళుతున్న క్రమంలో భారత్​-చైనా ఉద్రిక్త‌ల‌పై మీడియా అడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు ట్రంప్​.

“ఇది చాలా సంక్లిష్ట‌ పరిస్థితి. మేము ఇండియాతో మాట్లాడుతున్నాం. అలాగే చైనాతో మాట్లాడుతున్నాం. బార్డర్ విష‌యంలో వారికి పెద్ద సమస్య తలెత్తింది. వారు ఆపదలో ఉన్న‌ట్లే అనిపిస్తోంది. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం. వారికి సాయం చేసేందుకే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం” అని డొనాల్డ్​ ట్రంప్​ పేర్కొన్నారు.

జూన్ 15 రాత్రి తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో భారత్​-చైనా దేశాల మధ్య ఘర్షణ తలెత్తిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 20 మంది భారత జవాన్లు అమ‌రుల‌య్యారు. చైనా వైపు కూడా ప్రాణ న‌ష్టం జ‌రిగిన‌ట్టు సమాచారం. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తీవ్ర‌రూపం తాల్చాయి. లద్దాఖ్ స‌రిహ‌ద్దుల్లో యుద్ద‌మేఘాలు కమ్ముకున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu