నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ48 రాకెట్..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పీఎస్‌ఎల్వీ సీ48 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి రిసాట్ -2 బిఆర్ఐ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని పంపించే ప్రయోగం విజయవంతం అయింది. నెల్లూరులోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ సీ48 రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. రిసాట్ -2 బిఆర్ఐ ఉపగ్రహంతో పాటుగా మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. కాగా, ఈ ప్రయోగం దేశ రక్షణ రంగానికి కీలకం కానుంది. ఈ శాటిలైట్ […]

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ48 రాకెట్..
Follow us

|

Updated on: Dec 11, 2019 | 5:04 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పీఎస్‌ఎల్వీ సీ48 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి రిసాట్ -2 బిఆర్ఐ ఎర్త్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని పంపించే ప్రయోగం విజయవంతం అయింది. నెల్లూరులోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ సీ48 రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. రిసాట్ -2 బిఆర్ఐ ఉపగ్రహంతో పాటుగా మరో తొమ్మిది విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. కాగా, ఈ ప్రయోగం దేశ రక్షణ రంగానికి కీలకం కానుంది. ఈ శాటిలైట్ సుమారు 628 కేజీల బరువు ఉంటుంది. అమెరికాకు చెందిన 6 ఉపగ్రహాలు.. ఇజ్రాయిల్‌, జపాన్, ఇటలీకి చెందిన ఒక్కొ ఉపగ్రహాం పీఎస్‌ఎల్వీ సీ48 రాకెట్ ద్వారా అంతరిక్ష కక్ష్యలోకి వెళ్లాయి. పీఎస్ఎల్వీలో ఇది 50వ రాకెట్ కాగా.. శ్రీహరికోట కేంద్రం నుంచి 75వ రాకెట్.. అని ఇస్రో చైర్మన్ శివన్ చెప్పారు. ఇస్రో చరిత్రలో ఇదో అపూర్వ ఘట్టమని ఆయన పేర్కొన్నారు.

ఇక పీఎస్‌ఎల్వీ సీ48 రాకెట్ ప్రయోగం తర్వాత ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడారు. ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన ఇస్రో కుటుంబ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. PSLV సీరీస్ 50 ప్రయోగాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక సావనీర్‌ను విడుదల చేసిన శివన్… 50 ప్రయోగాల ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల లిస్ట్‌తో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.