సన్‌రైజర్స్ జట్టులోకి తెలుగు తేజం.. భువనేశ్వర్ స్థానంలో..

సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీనితో అతడి స్థానంలో తెలుగు తేజం పృథ్వీ రాజ్ కు జట్టులో..

సన్‌రైజర్స్ జట్టులోకి తెలుగు తేజం.. భువనేశ్వర్ స్థానంలో..
Follow us

|

Updated on: Oct 06, 2020 | 4:49 PM

IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తొడ కండరాల గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. దీనితో అతడి స్థానంలో తెలుగు తేజం పృథ్వీ రాజ్ యర్రాకు జట్టులో చోటు దక్కింది. పృథ్వీ రాజ్ ఇప్పటిదాకా 11 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 9 లిస్ట్ ఏ మ్యాచులు, మూడు టీ20లు ఆడి.. మొత్తం 43 వికెట్లు అతని ఖాతాలో వేసుకున్నాడు. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన పృథ్వీ రాజ్ యర్రా ఐపీఎల్ 2019లో కోల్‌కతా తరపున ప్రాతినిధ్యం వహించాడు.

కాగా, అక్టోబర్ 2న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్‌కు గాయమైన సంగతి తెలిసిందే. అది కాస్తా తీవ్రం కావడంతో.. టోర్నీ నుంచి పూర్తిగా భువనేశ్వర్ తప్పుకున్నాడు. రెండు నెలల పాటు విశ్రాంతి అవసరం అని ఫిజియోలు చెప్పడంతో ఆస్ట్రేలియా పర్యటనకు భువీ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించట్లేదు.

Also Read:

నేడే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా.!

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ.. చర్చించే కీలకాంశాలు ఇవే..

క్రెడిట్ కార్డు సైజులో ‘ఆధార్’.. అప్లై చేసుకోండిలా.!

వేగంగా భోజనం చేయడం వల్ల బరువు పెరుగుతారట.