డేంజర్ సెల్ఫీస్..! రైలుపైకెక్కి సెల్ఫీ తీసుకుంటూ నిట్టనిలువునా దహనమై బుగ్గిగామారిన ఇంటర్ విద్యార్థి

వెరైటీ సెల్ఫీ తీసుకుందామనుకున్న ఆ కుర్రాడు ప్రాణాలు పణంగా పెట్టాడు. రైలు బోగి పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునే క్రమంలో క్షణాల్లోనే నిట్టనిలువునా..

డేంజర్ సెల్ఫీస్..! రైలుపైకెక్కి సెల్ఫీ తీసుకుంటూ నిట్టనిలువునా దహనమై బుగ్గిగామారిన ఇంటర్ విద్యార్థి
Venkata Narayana

|

Dec 17, 2020 | 10:44 AM

వెరైటీ సెల్ఫీ తీసుకుందామనుకున్న ఆ కుర్రాడు ప్రాణాలు పణంగా పెట్టాడు. రైలు బోగి పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునే క్రమంలో క్షణాల్లోనే నిట్టనిలువునా కాలిబూడిదైపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ఉజ్వల భవిష్యత్, తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షల నడుమ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఒక నవయువకుడు ఇలా తన నిండు ప్రాణం పోగొట్టుకున్నాడు. ఒడిశా రాష్టం  పర్లాకిమిడికి చెందిన సి. హెచ్. సూర్జి కుమార్ అనే విద్యార్థి రైలు పైన వున్న విద్యుత్ వైర్లు కు తగిలి మృతి చెందాడు. ఆ క్రమంలో చెలరేగిన అగ్గి రవ్వలు ఆగి వున్న రైలు పై పడి పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఒడిషా రాష్ట్రంలోని గుణుపూర్ వెళ్లే పాసింజర్ రైలును కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా పర్లాకిమిడి రైల్వేస్టేషన్ వద్ద నిలిపివేశారు రైల్వే అధికారులు. అలా ఆగి వున్న రైలును చూసే వారు కొందరైతే, మరికొంత మంది ఆ రైలు పైకి ఎక్కి సరదా పడేవారూ వున్నారు.

అలా గత రాత్రి సరదాగా సెల్ఫీ కోసమై రైలుబోగి ఎక్కిన సూర్జి కుమార్ చేతులారా ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. ఈ ఘటన పై పర్లాకిమిడి రైల్వే అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం ఏంటంటే.., 25వేల హైఓల్డేజ్‌ కరెంట్ వైర్లతోనే రైళ్లు నడుస్తాయి. రైలు పైకిక్కితే.. పొరపాటున అవి తగిలితే.. శరీరంలో ఏ భాగమూ చూడ్డానికి మిగలదు. ఇక్కడ అదే జరిగింది. ట్రైన్‌పై నిలబడి సెల్ఫీ దిగబోయి కరెంట్‌షాక్‌కు గురయ్యాడు కుమార్. నిండు నూరేళ్లు బ్రతకాల్సిన మనిషి ఉన్నఫళంగా టప్పుమని పేలిపోయాడు. అతని వెర్రి చేష్టలకి ప్రాణం పోవడమే కాదు.. రైలు కూడా తగలబడింది. అయినా సెల్ఫీ అంటే సరదాగా ఉండాలి గానీ.. ప్రాణాలు తీసేంత వయిలెంట్‌గా ఎందుకు? కొండల మీదొకడు.. నదుల్లో ఒకడు.. నడిరోడ్ల మీద ఇంకోడు.. వస్తున్న రైలు ముందు నిలబడి మరోడు.. ఇదిగో ఇలా రైలెక్కి ఇంకొకడు. యువత.. ఇప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోవాలి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu