సాధరణంగా మనకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను మన ఫోన్లలో సేవ్ చేసుకుంటుంటాం. అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్ల నుంచి పిన్ నంబర్ల వరకు.. అలాగే జీమెయిల్, ఫేస్బుక్ వంటి వాటి పాస్వర్డ్లు, పర్సనల్ ఫోటోలను కూడా ఫోన్లలోనే సేవ్ చేసుకుంటుంటాం. వీటి కోసం ప్లే స్టోర్ నుంచి నోట్ పాడ్స్, అలాగే వర్డ్ పాడ్ అంటూ ఏవేవో యాప్‌లను డౌన్లోడ్ చేస్తుంటాం. అయితే ఇలా వ్యక్తిగత సమాచారాన్ని మొబైల్స్‌లో సేవ్ చేయొద్దని సూచిస్తున్నారు నిపుణులు. వీటివల్ల సైబర్ నేరగాళ్లు మీ పర్సనల్ డేటాను తీసుకునే అవకాశం ఉందని సూచిస్తు్న్నారు. అయితే ఫోన్లలో సేవ్ చేసుకునే పర్సనల్ డేటాను ఎలా భద్రపరుచుకోవాలో తెలుసుకుందాం.
ప్రస్తుతం అందరి జీవన ప్రయాణంలో మొబైల్ ఫోన్ సర్వసాధరణమైంది. దాంతోపాటే ఫోన్‌కు ప్రతిఒక్కరు పాస్వర్డ్ పెట్టుకుంటుంటారు. అయితే ఫోన్‌కు స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఒకే పాస్వర్డ్ ఎక్కువ సార్లు వాడకపోవడం మంచిది. ఇక వివిధ యాప్‌లలో స్టోర్ చేసే డేటా మొత్తం మెయిల్ అకౌంట్ ద్వారా క్లౌ్డ్ స్టోర్‌లో స్టోర్ అవుతుంది. అన్ని పాస్‌వర్డులను ఆటోఫిల్ ద్వారా స్టోర్ చేయడానికి బదులుగా పాస్వర్డ్ మేనేజర్ వాడొచ్చు. అలాగే డాష్ లైన్ లేదా లాస్ట్ పాస్ అనే సెక్యూర్ వంటివి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకొని అన్ని పాస్‌వర్డులకు ఒకేసారి యాక్సెస్ చేయవచ్చు. ఇక ఫింగర్ ఫ్రింట్ పాస్వర్డ్ అసలు సెక్యూర్ కాదు. ఎందుకంటే మీకు తెలియకుండానే ఫింగర్ ప్రింట్ ఇతరులు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి బదులుగా న్యూమరిక్ పాస్వర్డ్ పెట్టుకోవడం మంచిది.
వీటితోపాటు ఫేస్ లాక్ కూడా సరైనది కాదు. ఎందుకంటే కొన్ని సార్లు మీ ఫేస్ రిక్నగైనేషన్ కాదు. దీంతో ఫోన్ అన్ లాక్ అయ్యే అవకాశం ఉండదు. ఈ ఫేస్ లాక్కు బదులుగా పాట్రన్ పాస్వర్డ్, న్యూమరిక్ పాస్వర్డులు పెట్టుకోవడం మంచిది. ఇక అలాగే మీ ఫోన్లో పర్సనల్ ఫోటోలను సేవ్ చేయకపోవడం ఉత్తమం. మీ పర్సనల్ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్లలో సేవ్ చేసుకోవడం మంచిది. ఇక వీటికి పాస్వర్డ్ ఉపయోగించి యాక్సెస్ చేసుకునేలా చూసుకోండి. మీ మొబైల్స్‌లో వ్యక్తిగత సమాచారంతోపాటు ఫోటోలను కలిసి స్టోర్ చేయకండి. ఫోన్లో సేవ్ చేసిన ప్రతిడేటా అకౌంట్ ద్వారా క్లౌడ్ స్టోరేజీలోకి వెళ్ళిపోతుంది. ఇక క్లౌడ్ డేటా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో హ్యకర్ల చేతికి మీ పర్సనల్ డేటాతోపాటు.. ఫోటోలు కూడా వెళ్ళిపోతాయి. ఉద్యోగం చేసేవారు ఆఫీసు ఇచ్చిన ఫోన్లలో తమ పర్సనల్ డేటాను స్టోర్ చేయకూడదు. ఎందుకంటే మీ ఆఫీస్ ఫోన్‌ను మీ సహ ఉద్యోగులు యాక్సెస్ చేస్తే.. మీ డేటా మొత్తం వారికి చేరుతుంది. దాదాపు ఆఫీస్ ఫోన్‌ను వ్యక్తిగత అవసరాలకు వాడకపోవడంమే బెటర్.
వీటితోపాటు సాధరణంగా చాలా మంది తమ బ్యాంక్ అకౌంట్ నంబర్లు, పాస్‌వర్డులను ఫోన్లలో సేవ్ చేస్తుంటారు. ఇలా చేయడం చాలా రిస్క్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్నిసార్లు మీ ఫోన్ పోయినా.. హ్యాకర్ల చేతిలో పడినా మీ బ్యాంక్ వివరాలు మొత్తం తెలిసిపోతాయి. దీంతో ఆర్థికంగా మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. ఫోన్‌కు బదులుగా మీ ఇంట్లో ఉండే కంప్యూటర్ లేదా మీ పర్సనల్ ల్యాప్ టాప్‌లో సేవ్ చేసుకోవడం ఉత్తమం. ఇక ఆ సమాచారాన్ని మొత్తం యాక్సెస్ చేయడానికి ఒక యూనిక్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. దాదాపు కొంత మంది తమ ఇంటి అడ్రస్, సన్నిహితులు ఇంటి అడ్రస్ సేవ్ చేసుకుంటుంటారు. అలా చేయడం కూడా కొన్ని సార్లు రిస్క్. ఎందుకంటే మీ ఫోన్ పోయిన, లేదా సైబర్ నేరగాళ్ళు హ్యాక్ చేసినా.. మీ ఇంటి అడ్రస్ వివరాలు తెలియడంతో మీ పరిచయస్తుల్లాగా వచ్చి చోరీలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పర్సనల్ అకౌంట్లను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.
Also Read: